శుక్రవారం 5 ఆగస్టు 2011

బాగున్నారా?

హాయ్, చాలా రోజులయింది.అంతా బాగున్నారా? ఏమిటో,అసలు కుదరడం లేదు.ఈ సారి  నుంచి  తరచూ కలుద్దాం.సరేనా/బై

బుధవారం 2 మార్చి 2011

ఎంతకాలమెంతకాలం...?





ఎంతకాలమెంతకాలం! కాలమాగిపోనీ!  కొంతకాలం..అనుకుంటూ ఇన్నాళ్ళూ ఆగిపోయా. మరేంలేదు.కొంచెం అనారోగ్యం,మరికాస్త బద్ధకం..దాంతో బ్లాగులోకి తొంగి చూడలేదు.నమ్ముతారో లేదో, మెయిల్స్ కూడా చూడటం లేదు.డిసెంబరు లో  మొదలైన దగ్గు,జలుబు ఫిబ్రవరి దాకా లాగాయి.మూడుసార్లు డాక్టర్లను,మందులు మార్చా.ఇప్పుడు కొంచెం పర్వాలేదు.జనవరిలో వైజాగ్ వెళ్ళాను.అప్పుడు కొంచెం బాగుంది.మూడురోజులు అన్ని తిరిగి ఎంజాయ్ చేసాం.వచ్చాక బాలేదు.మరోపక్క రాష్ట్రం పరిస్థితి బాగాలేదు.ఎలాగో ఏమిటో. వైజాగ్ లో సేనోర రేసోర్ట్ లో దిగాం.బాల్కనీకి సముద్రం కనిపిస్తూ ఉంటుంది.చాలా బాగుంది.ఒకరోజు సింహాచలం,మరోరోజు అరకు వెళ్ళాం.కైలాసగిరి,బీచ్ అన్నీ తిరిగాం.వైజాగ్ లో అనగనగ ధీరుడు సినిమా చూసాం.మాల్స్ చూసాం.పదేళ్ళలో విశాఖ చాలా మారింది.అయినా బాగుంది.ఇవాల్టికి ఆపేస్తున్నా.వీలయితే వైజాగ్ ట్రిప్ ఫొటోస్ పెడతా.బై .

గురువారం 30 డిసెంబర్ 2010

amdarikee happy new year!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ మధ్య ఒంట్లో బాగాలేదు. అందుకే ఎవరినీ పలుకరించలేదు.అంత బాగున్నరనుకుంటాను.కొత్త ఏడాదిలో మాట్లాడుకుందాం.ఈ మధ్య మా కజిన్ పెళ్ళిలో సుమారు పదిమంది కజిన్స్ కలిసం.ఆ ఫోటో ఒకటి పెడుతున్నా.

బుధవారం 1 డిసెంబర్ 2010

మా ఎదురింటి అబ్బాయి...


పొద్దున్నే లేవగానే తోబాంటీ అని వచ్చేస్తాడు.మధుని 'నాన్నా' అని వాడు పిలిచినంత ఆర్ద్రంగా టిన్నుగాడుకూడా పిలవలేదు.ఇక వాడి అల్లరి చాలా తమాషాగా ఉంటుంది.అడిగింది ఇవ్వకపోతే పేచీ.పనివాళ్ళు వాడిని ఇంప్రెస్స్ చేసినంతగా ఇంకెవరూ చేయలేరు.రోజు ఇల్లు తుడవడం,తడి బట్టతో తుడవడం,దుమ్ము దులపడం అన్నీ చేస్తాడు.గుజరాతి వాళ్ళు అయినా వాళ్ళ అన్న,అమ్మానాన్నలు హిందీ బాగా మాట్లాడతారు.వాళ్ళకి తెలుగు చెప్పి లాభం లేదని అర్ధం అయింది.అందుకే వీడిని టార్గెట్ చేసుకుని తెలుగు నేర్పిస్తున్నాం.ప్రస్తుతం వాడికి రెండేళ్ళు.మూడేళ్ళ వరకూ జుట్టు తీయరట. అంచేత నా కన్నా పెద్ద జుట్టు ఉంది.వాళ్ళమ్మ సిక్కు పిల్లాడిలా ముడి వేస్తుంది.మొదట్లో నన్ను అమ్మ అనేవాడు.ఈ మధ్యనే తోబాంటీ అనడం నేర్చుకున్నాడు.ప్రీ- స్కూల్ కి వెళుతున్నాడు.పుస్తకాలు తెచ్చి అన్నీ చెప్పమంటాడు.టిన్నుతో తెగ ఆడతాడు.వాళ్ళ నాన్నని పప్పా అంటాడు.వాడిని ఏమడిగినా ఇవ్వడు. 'నాదీ' అంటాడు.మనవి ఇవ్వకపోతే ఊరుకోడు.చేతిలో ఉన్నవి విసిరేస్తాడు.కంప్యూటర్ లో పాటలు వినడం,చాటింగ్ చేయడం ఇష్టం.వాడికి వచ్చిన తెలుగు మాటల్లో లోపల,పైన,తుబ్బయ్య (సుబ్బయ్య-మా కుక్),కావాలి,అన్న ...ఇలా ఉంది.వాడిద్వారా వాళ్ళ అమ్మకీ కాస్త తెలుగు రావడం విశేషం.పనమ్మాయి రమ అంటే వాడికి చాలా ఇష్టం.వెళుతుంటే ఏడుస్తాడు.వాడికి ఐదో నెల నుంచీ అలవాటు.ఇంతకీ వాడి పేరు చెప్పలేదుకదూ!దేవ్.నేను ముద్దుగా దేవులూ,దేవయ్యా అంటూ ఉంటా.

ఆదివారం 7 నవంబర్ 2010

దీపావళి..ఒబామా.. మా టిన్నుబామా...

అబ్బ ! దీపావళి పండగ కూడా అయిపోయింది.అందుకే ఇంత సమయం.అర్ధం అవుతుందిలే.అందరూ పండగ బాగా చేసుకున్నారుకదా! సురక్షితంగా.. ఈ సారి మా వాడు చాలా డబ్బులు కాల్పించాడు . రకరకాల టపాకాయలు,రాకెట్లు.. ఎన్ని కాల్చినా సరిపోదు.మళ్ళా స్కూళ్ళు మొదలయ్యాయి.రేపటినుంచి మా వాడికి యూనిట్ టెస్టులు.అదేమిటో, ఏ ట్యూషన్ మా వాడికి నచ్చడం లేదు.నేనే తంటాలు పడాల్సి వస్తోంది.నిన్న జుట్టు ట్రిం చేయించు కోరా అంటే వెళ్లి ఒబామా కట్ అని గుండులా చేయించు కుని వచ్చాడు.( ఒబామా మీద అభిమానం కాదు.పొట్టి జుట్టు అంటే ఇష్టం)చలికాలం ఎవరైనా అలాచేస్తారా?చాలా కోపం వచ్చింది.కాసేపయ్యాక వాడికీ తెలిసింది బాగా లేదని.బిక్క మొహం వేసాడు.వాళ్ళ నాన్న ఏమో ఆ అదే పెరుగుతుందిలే అనేసాడు తేలిగ్గా .ఏదో ఓదార్చి పంపా స్కూలుకి.ఇంటికొచ్చాక తెలుస్తుంది ఎలా ఉందొ.అసలు చిన్నపిల్లలకు ఎంత జుట్టు ఉంటె అంత అందం. కానీ మా వాడు,వాళ్ళ నాన్న ఇద్దరూ కాస్త జుట్టు పెరగగానే కటింగ్ షాప్ పరుగెడతారు. అదేమిటో!ప్రస్తుతానికి మా వాడిని టిన్నుబామా అని వెక్కిరిస్తున్నా ...ఓ.కే .బాయ్.

మంగళవారం 19 అక్టోబర్ 2010

కేరళ...కథాకళి...భళీ!






అబ్బో, చాలా రోజులయింది బ్లాగుని చూసి.ఏమి చెయ్యను? మా టిన్ను పరీక్షలు.అవి అయ్యాక షిర్డీ వెళ్లి సాయి దర్సనం చెసుకున్నా.వచ్చిన వెంటనే కేరళ వెళ్ళాం.రాగానే పండగ.స్కూళ్ళు తెరిచే హడావుడి.ఇవాళే వచ్చా ఆఫీసుకి. కేరళ గురించి నాలుగు ముక్కలు చెప్పాలనిపించింది బ్లాగ్గర్లకు.రేపు ఫోటోలు లోడ్ చేస్తా.అప్పుడు అందరికీ వెళ్ళాలని అనిపిస్తుంది.ఎప్పటినుంచో కేరళ వెళ్ళాలని ప్రయత్నం.ఇన్నాళ్ళకు కుదిరింది.హైదరాబాదు నుంచి కొచ్చిన్ కి గంటన్నర ప్రయాణం (విమానంలో).అక్కడినుంచి కారులో మున్నార్ వెళ్ళాం.చాలా బాగుంది.అంతా టీ తోటలే.ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగుతుంది.జలపాతాలూ మధ్యలో పలకరిస్తాయి.మున్నార్లోఅలా తిరుగుతూ ఉండచ్చు.మంచు తాకుతూ ఉంటుంది.అక్కడ నేషనల్ పార్క్ చాలా ఎత్తున ప్రక్రుతి అందాలతో కనువిందు చేస్తుంది.పెద్ద జంతువులేమి కనిపించవు. తర్వాత టీ ఫ్యాక్టరీ చూసి, పొడి కొన్నాం.టీ తోటల మధ్య ఫోటోలు దిగాం. అక్కడ సరవన్ భవన్ లో టిఫిన్లు,భోజనాలు బాగున్నాయి.హోటల్ దగ్గర మసాజ్ సెంటర్లు ఉన్నాయిగాని మేము వెళ్ళలేదు.మర్నాడు తెక్కేడి వెళ్లాం.అక్కడ మార్షల్ ఆర్ట్స్ ,కథాకళి షో చూసాం.బాగా నచ్చాయి.పెరియార్ నదిలో బోటింగ్ చాలా బోరింగ్ గా ఉంది.పైగా దానికోసం చాలా కష్టపడి టికెట్లు తీసుకున్నాం.ఒక్క జంతువూ కనపడలేదు. ఆ మర్నాడు కుమారకోవ్ వెళ్ళాం.అక్కడ హౌసు బోటు లో వెళ్ళాం.అలా తిప్పుతూ అలెప్పి దగ్గర ఆపి భోజనం పెట్టారు.అంతా కుర్రాళ్ళే.చక్కగా వందారు.రెండు బెడ్రూములు,కిచెను, డైనింగ్ టేబుల్.. అన్ని హంగులూ ఉన్నాయా బోట్లో.రాత్రికి వేచ్చూర్ అనే ఊరి దగ్గర బోటు ఆపేశారు.మేము ఆ ఊళ్లోకి వెళ్ళాం.అక్కడ కృష్ణుడి గుడి ఉంది.చాలా బాగుంది.ఆ రాత్రి బోటు లోనే మకాం.తిని పడుకుని లేచి తయారయ్యి టిఫిన్ తినేసరికి మళ్ళా బయలుదేరిన చోటుకు వచ్చేసాం.మాకోసం కార్ రెడీగా ఉంది.బోటు కుర్రాళ్ళకి బై చెప్పి కొచ్చిన్ వచ్చాం.అక్కడ కాసేపు తిరిగి ద్వారకా అనే హోటల్లో భోజనం చేసాం.చాలా బాగుంది.వెళ్లేముందు కేరళలో ఫుడ్ ఎలాగా అని భయపడ్డ గానీ, మాకు అన్ని చోట్లా బాగానే శాకాహార భోజనం దొరికింది.మా డ్రైవర్ కూడా చక్కగా అన్నీ తిప్పాడు.అక్కడ దొరికే మసాల ద్రవ్యాలు చాలా కొన్నా. కొచ్చిన్లో షాపింగ్ చేయడానికి టైం సరిపోలేదు.ఆ పచ్చదనాన్ని మనసులో నింపుకొని బై కేరళ అని విమానం ఎక్కేసాం.

శుక్రవారం 24 సెప్టెంబర్ 2010

గణేశా!రక్షించు కాలుష్యం బారి నుంచి...

అంతా ప్రశాంతంగా ముగిసింది. పిన్న,పెద్ద తేడా లేకుండా వర్షం లెక్క చేయకుండా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు.వేలకొలది విగ్రహాలు నీట మునిగాయి.ఇప్పటి హుస్సేన్ సాగర్ చూస్తె ఒక రకమైన ఆవేదన కలుగుతోంది.కొన్ని విగ్రహాలు నిస్సహాయంగా నీటిలో తేలుతున్నాయి.నీటిలో కరగలేక మరికొన్ని కొట్టుకు వస్తున్నాయి.టన్నులకొద్దీ చెత్త.వస్తూనే ఉంది.రోడ్లపై అడ్డంగా వేసిన పందిళ్ళు ఇంకాతీయలేదు.వాహనదారులు విసుక్కుంటూ వెళ్తున్నారు.భక్తీ పేరిట ఇంత హంగామా అవసరమా?చిన్న చిన్న మట్టి విగ్రహాలు,రకరకాల ఆకులతో పూజిస్తే దేవుడికీ,మనకూ ఎంత మంచిదో కదా!ఆ విషయం వీర భక్తులకు చెప్పేదెవరు?ప్రభుత్వానికీ ఎంత ఖర్చు?పోలీసు ఏర్పాట్లకు,క్రేన్లకు ఎంతెంత ఖర్చు?అదంతా అలా ఉంచితే హుస్సేన్ సాగర్లో పేరుకున్న కాలుష్యం ఎవరు తొలగించగలరు?దేవుడా?నువ్వే రక్షించాలి.