హాయ్, ఈ రోజు అవిసె గింజల పొడి తయారీ చెప్పాలనుకుంటున్నాను.ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.పైగా శాకాహారులకు మరీ అవసరం.flaxseed s అని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి.వీటిని కొంచెం వేయించి పెట్టుకోవాలి.కొంచెం నేతిలో ధనియాలు,జీలకర్ర,వెల్లుల్లి,ఎర్ర మిర్చి ,కరివేపాకు వేయించి ,ఉప్పు,ఆమచూర్ కలిపి అవిసె గింజలతో పాటు పొడి చేయాలి.కారప్పోడిలా అన్నమాట.ప్రతిరోజూ అన్నంలో ఒక స్పూను పొడి కలిపి తింటే చాల మంచిది.ఉత్తి అవిసె గింజలు తినలేక నేను కనిపెట్టిన ఈ వంటకం చేసి చూడండి.