19, అక్టోబర్ 2010, మంగళవారం
కేరళ...కథాకళి...భళీ!
అబ్బో, చాలా రోజులయింది బ్లాగుని చూసి.ఏమి చెయ్యను? మా టిన్ను పరీక్షలు.అవి అయ్యాక షిర్డీ వెళ్లి సాయి దర్సనం చెసుకున్నా.వచ్చిన వెంటనే కేరళ వెళ్ళాం.రాగానే పండగ.స్కూళ్ళు తెరిచే హడావుడి.ఇవాళే వచ్చా ఆఫీసుకి. కేరళ గురించి నాలుగు ముక్కలు చెప్పాలనిపించింది బ్లాగ్గర్లకు.రేపు ఫోటోలు లోడ్ చేస్తా.అప్పుడు అందరికీ వెళ్ళాలని అనిపిస్తుంది.ఎప్పటినుంచో కేరళ వెళ్ళాలని ప్రయత్నం.ఇన్నాళ్ళకు కుదిరింది.హైదరాబాదు నుంచి కొచ్చిన్ కి గంటన్నర ప్రయాణం (విమానంలో).అక్కడినుంచి కారులో మున్నార్ వెళ్ళాం.చాలా బాగుంది.అంతా టీ తోటలే.ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగుతుంది.జలపాతాలూ మధ్యలో పలకరిస్తాయి.మున్నార్లోఅలా తిరుగుతూ ఉండచ్చు.మంచు తాకుతూ ఉంటుంది.అక్కడ నేషనల్ పార్క్ చాలా ఎత్తున ప్రక్రుతి అందాలతో కనువిందు చేస్తుంది.పెద్ద జంతువులేమి కనిపించవు. తర్వాత టీ ఫ్యాక్టరీ చూసి, పొడి కొన్నాం.టీ తోటల మధ్య ఫోటోలు దిగాం. అక్కడ సరవన్ భవన్ లో టిఫిన్లు,భోజనాలు బాగున్నాయి.హోటల్ దగ్గర మసాజ్ సెంటర్లు ఉన్నాయిగాని మేము వెళ్ళలేదు.మర్నాడు తెక్కేడి వెళ్లాం.అక్కడ మార్షల్ ఆర్ట్స్ ,కథాకళి షో చూసాం.బాగా నచ్చాయి.పెరియార్ నదిలో బోటింగ్ చాలా బోరింగ్ గా ఉంది.పైగా దానికోసం చాలా కష్టపడి టికెట్లు తీసుకున్నాం.ఒక్క జంతువూ కనపడలేదు. ఆ మర్నాడు కుమారకోవ్ వెళ్ళాం.అక్కడ హౌసు బోటు లో వెళ్ళాం.అలా తిప్పుతూ అలెప్పి దగ్గర ఆపి భోజనం పెట్టారు.అంతా కుర్రాళ్ళే.చక్కగా వందారు.రెండు బెడ్రూములు,కిచెను, డైనింగ్ టేబుల్.. అన్ని హంగులూ ఉన్నాయా బోట్లో.రాత్రికి వేచ్చూర్ అనే ఊరి దగ్గర బోటు ఆపేశారు.మేము ఆ ఊళ్లోకి వెళ్ళాం.అక్కడ కృష్ణుడి గుడి ఉంది.చాలా బాగుంది.ఆ రాత్రి బోటు లోనే మకాం.తిని పడుకుని లేచి తయారయ్యి టిఫిన్ తినేసరికి మళ్ళా బయలుదేరిన చోటుకు వచ్చేసాం.మాకోసం కార్ రెడీగా ఉంది.బోటు కుర్రాళ్ళకి బై చెప్పి కొచ్చిన్ వచ్చాం.అక్కడ కాసేపు తిరిగి ద్వారకా అనే హోటల్లో భోజనం చేసాం.చాలా బాగుంది.వెళ్లేముందు కేరళలో ఫుడ్ ఎలాగా అని భయపడ్డ గానీ, మాకు అన్ని చోట్లా బాగానే శాకాహార భోజనం దొరికింది.మా డ్రైవర్ కూడా చక్కగా అన్నీ తిప్పాడు.అక్కడ దొరికే మసాల ద్రవ్యాలు చాలా కొన్నా. కొచ్చిన్లో షాపింగ్ చేయడానికి టైం సరిపోలేదు.ఆ పచ్చదనాన్ని మనసులో నింపుకొని బై కేరళ అని విమానం ఎక్కేసాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆ పచ్చదనాన్ని మనసులో నింపుకొని బై కేరళ అని విమానం ఎక్కేసాం.
రిప్లయితొలగించండిEe matatho Naa flashback gurthuchesaru.