మన దేశంలో చాలా మంది పెళ్లి అనగానే నక్షత్రాలు,జాతకాలు,అని పరిగెడుతూ ఉంటారు.వందేల్లక్రితం ఎలా ఉందొ ఇప్పుడూ అంతే. ఈ విషయంలో మారలేకపోతున్నారు అటు తల్లిదండ్రులు,ఇటు పిల్లలు. ఇప్పటి తరం ఆలోచనలు,ఆశలు వేరు. నిజానికి వీరికి పెళ్లి విషయంలో సహాయం చేయాల్సింది కౌన్సిలర్లు.వారు ఇచ్చే సలహాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయి.వాస్తవానికి ఇద్దరు వ్యక్తులు కలసి జీవించాల్సిన తరుణంలో వారి మధ్య అవగాహన,ఆసక్తుల కలయిక ముఖ్యం.అంతేగానీ నక్షత్రాలు,జాతకాలు కావు. పెళ్ళిళ్ళు స్వర్గంలో కాదు, భూమి మీదే కుదురుతాయని గ్రహించడం ఇక్కడ చాలా ముఖ్యం. ఒక సర్వే ప్రకారం ఇరవై శాతం పెళ్ళిళ్ళు విడాకులకు దారి తీస్తున్నాయి. లెక్కలకు అందనివీ చాలా ఉంటాయి.అందుకే పెళ్ళికి ముందే కాబోయే వధూవరులు కుటుంబ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.తద్వారా ముందే ఒకరి గురించి మరొకరు తెలుసుకోడమే కాక దానిని భవిష్యత్తుకు చక్కని బాటగా చేసుకుంటున్నారు.ఢిల్లీ లోని విమ్హన్స్ లో పనిచేసే సైకియాట్రిస్ట్ జితేంద్ర నాగ్పాల్ అభిప్రాయం ప్రకారం 'ఈ రోజుల్లో జీవితం చాలా వేగంగా,క్లిష్టంగా ఉంటోంది.దాంతో కుటుంబ సంస్కృతీ,వాతావరణం పిల్లలపై పెద్ద ప్రభావం చూపడం లేదు.దాంతో తమ భాగస్వామి నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలియడం లేదు.మరోపక్క మహిళల పరిస్థితిలో పలు మార్పులు వచ్చాయి. బయట మహిళను తనతో సమంగా గౌరవించిన పురుషుడు ఇంట్లో మాత్రం అలాఒప్పుకోలేక పోతున్నాడు.ఇది మహిళలూ తట్టుకోలేకపోతున్నారు.ఈ పరిస్థితుల్లో వారికి మార్గదర్శనం చేసి,కుటుంబ జీవితం గురించి ఇద్దరికీ అవగాహన కలిగించాలి.అందుకు కుటుంబ నిపుణులే సమర్ధులు '.
ప్రీ మారిటల్ కౌన్సిల్లింగ్ ద్వార కుటుంబ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకొని,సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.కొన్నిసార్లు తల్లిదండ్రులకి పిల్లల అభిప్రాయాలు తెలియక పోవచ్చు.అలాంటపుడు కౌన్సిలింగ్ సహాయపడుతుంది.కుటుంబాల్లో ఉండే సంప్రదాయాలు,ఆచారాలు,అలవాట్లు,ఆర్ధిక విషయాలు,సాంఘిక విలువలు, కుటుంబ సభ్యుల పాత్ర,...ఇలా వీటిలో తమకు సరిపడేవి,సరిపదనివి ముందే విస్లేశించుకునే అవకాసం దొరుకుతుంది.మానసికంగా,శారీరకంగా సిద్ధామో కాదో తెలుసుకోవచ్చు.అయితే ప్రస్తుతం అయిదు శాతం మాత్రమె ఈ విషయంలో నిపుణులను సంప్రదిస్తున్నారు.అదికూడా నగర ప్రాంతాల్లో. పల్లెలు,చిన్న టౌన్లలో చాలా మారాలి.అప్పుడు విడాకుల శాతం తగ్గుతుంది.
ప్రేమలో పడటం సులభమే.కాని కడదాకా ఆ ప్రేమ నిలవడమే కష్టం.మనం చదివే పాఠాల్లో ఎక్కడైనా కుటుంబ సంబంధాలు విజయవంతంగా ఎలా నిర్వర్తిన్చాలో ఉంటుందా?ఉండదు. అలాంటపుడు కుటుంబ నిపుణులు మనకు మార్గదర్శనం చేయగలరు.అందుకే తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ చేయించడం అవసరం అంటున్నారు ఈ రంగంలో నిపుణులు.ఇప్పుడు అర్ధం అయిందా పెళ్ళిళ్ళు ఎవరు కుదర్చాలో?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి