చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి...
అనగనగా ఓ అబ్బాయి,అమ్మాయి.చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు.ఇద్దరి కులాలు వేరు.అయినా పెద్దలను ఒప్పించారు.పెళ్ళి చేసుకున్నారు.ఇంతవరకూ బాగానే ఉందికదా!సాధారణంగా కధలు,సినిమాల్లో ఇక్కడివరకే చూస్తాం. ఈ కధలోనే అనేక మలుపులు ఉంటాయి.చివరకు సుఖాంతం. కానీ నిజజీవితంలో పెళ్ళి తరవాతే అసలు సమస్యలు మొదలవుతాయి. భార్యాభర్తలు ఇద్దరికీ నిత్యజీవిత సమరం అవుతుంది.అన్నాళ్ళూ ఇద్దరూ ప్రేమలో మునిగిపోయి వారి బలాలు,బలహీనతలు చూసుకోరు.పైగా అంతవరకూ ఎటువంటి బాధ్యతలూ ఉండవు.అమ్మానాన్నలు అన్నీ అమరిస్తే హాయిగా ఉన్నారు.ఇప్పుడో, అన్నీ వీరే చూసుకోవాలి. ఇల్లు,ఉద్యోగం,సామాన్లు... ఒకటి కాదు. సరే,ఈ దశ కూదా
దాటారనుకుందాం. ఇంటిపనులు, బయటిపనులు...వీటిదగ్గర గొడవ మొదలవుతుంది.అది తనకు సంబంధం లేని విషయంలా అబ్బాయి,తప్పనిసరి తద్దినంలా అమ్మాయి కొత్తకాపురం మొదలవుతుంది.ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే సమస్య ఇంకాస్త పెరుగుతుంది.తానెందుకు పని అంతా చెయ్యాలని అమ్మాయి వాదన.దానికి అబ్బయి విచిత్రంగా చూసి,అదేదో ఆమె బాధ్యత అన్నట్లు మాట్లాడతాడు.వెంటనే ఆమె తనపై ప్రేమ లేదని అనేస్తుంది. చిత్రం యేమిటంటే,పెళ్ళికి ముందు గంటలు గంటలు మాట్లాడుకున్నా ఇంటి బాధ్యతలు,ఎవరెవరు ఏ పని చేసుకోవాలి, ఎలా కలసి సహకరించుకోవాలి అనే విషయలు ఉండవు. ప్రేమ పెళ్ళిళ్ళు అన్నిట్లో దాదాపు ఇంతే.ఇక గొడవలు మొదలయ్యాక ఒకరినొకరు అనుకునే మాటలు వింటే వీరేనా ప్రేమకోసం ఏదయినా చెయ్యడానికి సిద్ధపడింది అనిపిస్తుంది.ప్రతి విషయంలో పోటీ పడుతూ ,సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు. వాదనలకోసం ఎంతసేపైనా కేటాయిస్తారు కానీ కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందాం అనుకోరు.ఈ సమస్యలు ప్రేమ పెళ్ళిళ్ళకే కాదు.పెద్దలు చేసే వివాహాల్లోనూ ఉంటాయి. పెళ్ళి చేయదానికి త్వరపదే పెద్దలు అమ్మాయి,అబ్బాయి అభిరుచులు కలిసాయా లేదా అనే విషయం పట్టించుకోరు. దానితో పెంపకాల తేడా వల్ల దంపతుల్లో అభిప్రాయభేదాలు వస్తుంటాయి. అందుకే ఎవరైనా సరె,పెళ్ళికి ముందే కొన్ని విషయాలు మాట్లాడుకోవడంద్వారా అనేక సమస్యలు నివారించవచ్చు. అలా మాట్లాడుకోవలసిన విషయాలేమిటో రేపు చూద్దాం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి