3, జూన్ 2014, మంగళవారం

తరాల తేడా గుర్తిస్తున్నారా?

ఈ కాలం జంటల్లో సాధారణంగా కన్పిస్తున్న అంశం ఏ ఒక్కరూ వివాహానంతర జీవితం గురించి ఆలోచించడం లేదు. తమ సంసారం బాగుండాలంటే ఏం చేయాలి అనుకోవడం లేదు.దీనికి కారణం కొంత, వివాహ వ్యవస్థలో వస్తున్నా మార్పుల్ని సరిగా అర్ధం చేసుకోకపోవడమే.ఈ కాలపు యువత ఆధునిక జీవితానికి అలవాటు పడుతోంది.అయినా పెళ్లి దగ్గరికొచ్చేసరికి రకరకాల కారణాల వాళ్ళ పెద్దవారిమీదే ఆధార పడుతున్నారు.దాంతో వారి అభిరుచులకు తగిన భాగస్వాములను పొందలేకపోతున్నారు.మన అమ్మానాన్నలు బాగానే ఉన్నారుకదా మనమూ అలాగే ఉండచ్చు అనుకుంటారు.కానీ పెళ్ళయిన వెంటనే గొడవలు..ఎందుకిలా ?లెక్క eక్కడ తప్పుతోందిఅంటే..మన అమ్మానాన్నల తరానికి ,ఇప్పటి తరానికి చాలా తేడా ఉంది.ఇది గుర్తిన్చానంతకాలం సమస్యలు వస్తూనే ఉంటాయి.కొంచెం తీరిక చేసుకుని పెళ్ళికి ముందు మాట్లాడుకుంటే చాలా సమస్యలు దూరం చేసుకోవచ్చు.కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు రాణించడానికి సమర్ధత ఎంత అవసరమో, ఎలా పై అధికారుల మెప్పు పొందాలని ప్రయత్నిస్తామో,అలాగే వివాహబందానికీ కృషి చెయ్యాలి.అంచేత...
-అబ్బాయి అమెరిక నుంచి వచ్చాడని,టైం లేదని హడావుడిగా పెళ్లి చెయ్యకూడదు.జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధానికి కాస్త సమయం కేటాయిస్తే నష్టం లేదు.తల్లిదండ్రులే ఈ విషయంలో సహకరించాలి.అమ్మాయి,అబ్బాయి ఒకరినొకరు అర్ధం చేసుకునే సమయం ఇవ్వాలి.పెళ్లి అయిన ఆరునెలలకే విడాకులకు పరుగెత్తే కంటే, ముందు ఆరునెలలు ఒకరినొకరు అర్ధం చేసుకోవడం మంచిది.
- ఒకరిగురించి మరొకరు తెలుసుకోవడమే కాదు.వారి కుటుంబ నేపథ్యాలూ వివరించాలి.వెళ్లబోయే కుటుంబంలో ఎంతవకు ఇమదగలం,అందుకు ఎలాంటి కృషి చేయాలి అని తెలుసుకోవాలి.పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమ్మాయిని ఉమ్మడి కుటుంబంలో ఇస్తే వచ్చే సమస్యలవంటివి(లేటుగా లేవడం,పూజలు,వంటలు రాకపోవడం...)నివారించవచ్చు.
-పెళ్లి నిర్ణయంలో తల్లిదండ్రుల జోక్యం చాలా తక్కువగా ఉండాలి.అయితే దీనికి ముందు తల్లిదండ్రులూ ప్రిపేర్ కావాలి. చాలా మంది తమ పిల్లల చదువు,దుస్తులు,నగల గురించి ఆలోచించినట్లు పెళ్లి,తర్వాతి జీవితం గురించి ఆలోచించడం లేదు.
- కొత్తగా పెళ్ళయిన వారు కనీసం రెండు సంవత్సరాలు ఇరువైపులా పెద్దలకు దూరంగా ఉండాలి.అప్పుడే ఇద్దరిమధ్య చక్కని స్నేహం పెరుగుతుంది.
-మనం చేసుకునేవారు చూడగానే అద్భుతం అనిపించకపోయినా పర్వాలేదు కానీ వారి సమక్షం అసౌకర్యంగా ఉండకూడదు.అలా అనిపిస్తే ముందే ఆలోచించాలి.

4, మార్చి 2012, ఆదివారం

 హాయ్, ఈ రోజు అవిసె గింజల పొడి తయారీ చెప్పాలనుకుంటున్నాను.ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.పైగా శాకాహారులకు మరీ అవసరం.flaxseed s  అని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి.వీటిని కొంచెం వేయించి పెట్టుకోవాలి.కొంచెం నేతిలో ధనియాలు,జీలకర్ర,వెల్లుల్లి,ఎర్ర మిర్చి ,కరివేపాకు వేయించి ,ఉప్పు,ఆమచూర్ కలిపి  అవిసె గింజలతో పాటు పొడి చేయాలి.కారప్పోడిలా  అన్నమాట.ప్రతిరోజూ అన్నంలో ఒక స్పూను పొడి కలిపి తింటే చాల మంచిది.ఉత్తి అవిసె గింజలు తినలేక నేను కనిపెట్టిన ఈ వంటకం చేసి చూడండి.

5, ఆగస్టు 2011, శుక్రవారం

బాగున్నారా?

హాయ్, చాలా రోజులయింది.అంతా బాగున్నారా? ఏమిటో,అసలు కుదరడం లేదు.ఈ సారి  నుంచి  తరచూ కలుద్దాం.సరేనా/బై

2, మార్చి 2011, బుధవారం

ఎంతకాలమెంతకాలం...?





ఎంతకాలమెంతకాలం! కాలమాగిపోనీ!  కొంతకాలం..అనుకుంటూ ఇన్నాళ్ళూ ఆగిపోయా. మరేంలేదు.కొంచెం అనారోగ్యం,మరికాస్త బద్ధకం..దాంతో బ్లాగులోకి తొంగి చూడలేదు.నమ్ముతారో లేదో, మెయిల్స్ కూడా చూడటం లేదు.డిసెంబరు లో  మొదలైన దగ్గు,జలుబు ఫిబ్రవరి దాకా లాగాయి.మూడుసార్లు డాక్టర్లను,మందులు మార్చా.ఇప్పుడు కొంచెం పర్వాలేదు.జనవరిలో వైజాగ్ వెళ్ళాను.అప్పుడు కొంచెం బాగుంది.మూడురోజులు అన్ని తిరిగి ఎంజాయ్ చేసాం.వచ్చాక బాలేదు.మరోపక్క రాష్ట్రం పరిస్థితి బాగాలేదు.ఎలాగో ఏమిటో. వైజాగ్ లో సేనోర రేసోర్ట్ లో దిగాం.బాల్కనీకి సముద్రం కనిపిస్తూ ఉంటుంది.చాలా బాగుంది.ఒకరోజు సింహాచలం,మరోరోజు అరకు వెళ్ళాం.కైలాసగిరి,బీచ్ అన్నీ తిరిగాం.వైజాగ్ లో అనగనగ ధీరుడు సినిమా చూసాం.మాల్స్ చూసాం.పదేళ్ళలో విశాఖ చాలా మారింది.అయినా బాగుంది.ఇవాల్టికి ఆపేస్తున్నా.వీలయితే వైజాగ్ ట్రిప్ ఫొటోస్ పెడతా.బై .

30, డిసెంబర్ 2010, గురువారం

amdarikee happy new year!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ మధ్య ఒంట్లో బాగాలేదు. అందుకే ఎవరినీ పలుకరించలేదు.అంత బాగున్నరనుకుంటాను.కొత్త ఏడాదిలో మాట్లాడుకుందాం.ఈ మధ్య మా కజిన్ పెళ్ళిలో సుమారు పదిమంది కజిన్స్ కలిసం.ఆ ఫోటో ఒకటి పెడుతున్నా.

1, డిసెంబర్ 2010, బుధవారం

మా ఎదురింటి అబ్బాయి...


పొద్దున్నే లేవగానే తోబాంటీ అని వచ్చేస్తాడు.మధుని 'నాన్నా' అని వాడు పిలిచినంత ఆర్ద్రంగా టిన్నుగాడుకూడా పిలవలేదు.ఇక వాడి అల్లరి చాలా తమాషాగా ఉంటుంది.అడిగింది ఇవ్వకపోతే పేచీ.పనివాళ్ళు వాడిని ఇంప్రెస్స్ చేసినంతగా ఇంకెవరూ చేయలేరు.రోజు ఇల్లు తుడవడం,తడి బట్టతో తుడవడం,దుమ్ము దులపడం అన్నీ చేస్తాడు.గుజరాతి వాళ్ళు అయినా వాళ్ళ అన్న,అమ్మానాన్నలు హిందీ బాగా మాట్లాడతారు.వాళ్ళకి తెలుగు చెప్పి లాభం లేదని అర్ధం అయింది.అందుకే వీడిని టార్గెట్ చేసుకుని తెలుగు నేర్పిస్తున్నాం.ప్రస్తుతం వాడికి రెండేళ్ళు.మూడేళ్ళ వరకూ జుట్టు తీయరట. అంచేత నా కన్నా పెద్ద జుట్టు ఉంది.వాళ్ళమ్మ సిక్కు పిల్లాడిలా ముడి వేస్తుంది.మొదట్లో నన్ను అమ్మ అనేవాడు.ఈ మధ్యనే తోబాంటీ అనడం నేర్చుకున్నాడు.ప్రీ- స్కూల్ కి వెళుతున్నాడు.పుస్తకాలు తెచ్చి అన్నీ చెప్పమంటాడు.టిన్నుతో తెగ ఆడతాడు.వాళ్ళ నాన్నని పప్పా అంటాడు.వాడిని ఏమడిగినా ఇవ్వడు. 'నాదీ' అంటాడు.మనవి ఇవ్వకపోతే ఊరుకోడు.చేతిలో ఉన్నవి విసిరేస్తాడు.కంప్యూటర్ లో పాటలు వినడం,చాటింగ్ చేయడం ఇష్టం.వాడికి వచ్చిన తెలుగు మాటల్లో లోపల,పైన,తుబ్బయ్య (సుబ్బయ్య-మా కుక్),కావాలి,అన్న ...ఇలా ఉంది.వాడిద్వారా వాళ్ళ అమ్మకీ కాస్త తెలుగు రావడం విశేషం.పనమ్మాయి రమ అంటే వాడికి చాలా ఇష్టం.వెళుతుంటే ఏడుస్తాడు.వాడికి ఐదో నెల నుంచీ అలవాటు.ఇంతకీ వాడి పేరు చెప్పలేదుకదూ!దేవ్.నేను ముద్దుగా దేవులూ,దేవయ్యా అంటూ ఉంటా.

7, నవంబర్ 2010, ఆదివారం

దీపావళి..ఒబామా.. మా టిన్నుబామా...

అబ్బ ! దీపావళి పండగ కూడా అయిపోయింది.అందుకే ఇంత సమయం.అర్ధం అవుతుందిలే.అందరూ పండగ బాగా చేసుకున్నారుకదా! సురక్షితంగా.. ఈ సారి మా వాడు చాలా డబ్బులు కాల్పించాడు . రకరకాల టపాకాయలు,రాకెట్లు.. ఎన్ని కాల్చినా సరిపోదు.మళ్ళా స్కూళ్ళు మొదలయ్యాయి.రేపటినుంచి మా వాడికి యూనిట్ టెస్టులు.అదేమిటో, ఏ ట్యూషన్ మా వాడికి నచ్చడం లేదు.నేనే తంటాలు పడాల్సి వస్తోంది.నిన్న జుట్టు ట్రిం చేయించు కోరా అంటే వెళ్లి ఒబామా కట్ అని గుండులా చేయించు కుని వచ్చాడు.( ఒబామా మీద అభిమానం కాదు.పొట్టి జుట్టు అంటే ఇష్టం)చలికాలం ఎవరైనా అలాచేస్తారా?చాలా కోపం వచ్చింది.కాసేపయ్యాక వాడికీ తెలిసింది బాగా లేదని.బిక్క మొహం వేసాడు.వాళ్ళ నాన్న ఏమో ఆ అదే పెరుగుతుందిలే అనేసాడు తేలిగ్గా .ఏదో ఓదార్చి పంపా స్కూలుకి.ఇంటికొచ్చాక తెలుస్తుంది ఎలా ఉందొ.అసలు చిన్నపిల్లలకు ఎంత జుట్టు ఉంటె అంత అందం. కానీ మా వాడు,వాళ్ళ నాన్న ఇద్దరూ కాస్త జుట్టు పెరగగానే కటింగ్ షాప్ పరుగెడతారు. అదేమిటో!ప్రస్తుతానికి మా వాడిని టిన్నుబామా అని వెక్కిరిస్తున్నా ...ఓ.కే .బాయ్.