30, డిసెంబర్ 2010, గురువారం

amdarikee happy new year!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ మధ్య ఒంట్లో బాగాలేదు. అందుకే ఎవరినీ పలుకరించలేదు.అంత బాగున్నరనుకుంటాను.కొత్త ఏడాదిలో మాట్లాడుకుందాం.ఈ మధ్య మా కజిన్ పెళ్ళిలో సుమారు పదిమంది కజిన్స్ కలిసం.ఆ ఫోటో ఒకటి పెడుతున్నా.

1, డిసెంబర్ 2010, బుధవారం

మా ఎదురింటి అబ్బాయి...


పొద్దున్నే లేవగానే తోబాంటీ అని వచ్చేస్తాడు.మధుని 'నాన్నా' అని వాడు పిలిచినంత ఆర్ద్రంగా టిన్నుగాడుకూడా పిలవలేదు.ఇక వాడి అల్లరి చాలా తమాషాగా ఉంటుంది.అడిగింది ఇవ్వకపోతే పేచీ.పనివాళ్ళు వాడిని ఇంప్రెస్స్ చేసినంతగా ఇంకెవరూ చేయలేరు.రోజు ఇల్లు తుడవడం,తడి బట్టతో తుడవడం,దుమ్ము దులపడం అన్నీ చేస్తాడు.గుజరాతి వాళ్ళు అయినా వాళ్ళ అన్న,అమ్మానాన్నలు హిందీ బాగా మాట్లాడతారు.వాళ్ళకి తెలుగు చెప్పి లాభం లేదని అర్ధం అయింది.అందుకే వీడిని టార్గెట్ చేసుకుని తెలుగు నేర్పిస్తున్నాం.ప్రస్తుతం వాడికి రెండేళ్ళు.మూడేళ్ళ వరకూ జుట్టు తీయరట. అంచేత నా కన్నా పెద్ద జుట్టు ఉంది.వాళ్ళమ్మ సిక్కు పిల్లాడిలా ముడి వేస్తుంది.మొదట్లో నన్ను అమ్మ అనేవాడు.ఈ మధ్యనే తోబాంటీ అనడం నేర్చుకున్నాడు.ప్రీ- స్కూల్ కి వెళుతున్నాడు.పుస్తకాలు తెచ్చి అన్నీ చెప్పమంటాడు.టిన్నుతో తెగ ఆడతాడు.వాళ్ళ నాన్నని పప్పా అంటాడు.వాడిని ఏమడిగినా ఇవ్వడు. 'నాదీ' అంటాడు.మనవి ఇవ్వకపోతే ఊరుకోడు.చేతిలో ఉన్నవి విసిరేస్తాడు.కంప్యూటర్ లో పాటలు వినడం,చాటింగ్ చేయడం ఇష్టం.వాడికి వచ్చిన తెలుగు మాటల్లో లోపల,పైన,తుబ్బయ్య (సుబ్బయ్య-మా కుక్),కావాలి,అన్న ...ఇలా ఉంది.వాడిద్వారా వాళ్ళ అమ్మకీ కాస్త తెలుగు రావడం విశేషం.పనమ్మాయి రమ అంటే వాడికి చాలా ఇష్టం.వెళుతుంటే ఏడుస్తాడు.వాడికి ఐదో నెల నుంచీ అలవాటు.ఇంతకీ వాడి పేరు చెప్పలేదుకదూ!దేవ్.నేను ముద్దుగా దేవులూ,దేవయ్యా అంటూ ఉంటా.