30, డిసెంబర్ 2010, గురువారం

amdarikee happy new year!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ మధ్య ఒంట్లో బాగాలేదు. అందుకే ఎవరినీ పలుకరించలేదు.అంత బాగున్నరనుకుంటాను.కొత్త ఏడాదిలో మాట్లాడుకుందాం.ఈ మధ్య మా కజిన్ పెళ్ళిలో సుమారు పదిమంది కజిన్స్ కలిసం.ఆ ఫోటో ఒకటి పెడుతున్నా.

1, డిసెంబర్ 2010, బుధవారం

మా ఎదురింటి అబ్బాయి...


పొద్దున్నే లేవగానే తోబాంటీ అని వచ్చేస్తాడు.మధుని 'నాన్నా' అని వాడు పిలిచినంత ఆర్ద్రంగా టిన్నుగాడుకూడా పిలవలేదు.ఇక వాడి అల్లరి చాలా తమాషాగా ఉంటుంది.అడిగింది ఇవ్వకపోతే పేచీ.పనివాళ్ళు వాడిని ఇంప్రెస్స్ చేసినంతగా ఇంకెవరూ చేయలేరు.రోజు ఇల్లు తుడవడం,తడి బట్టతో తుడవడం,దుమ్ము దులపడం అన్నీ చేస్తాడు.గుజరాతి వాళ్ళు అయినా వాళ్ళ అన్న,అమ్మానాన్నలు హిందీ బాగా మాట్లాడతారు.వాళ్ళకి తెలుగు చెప్పి లాభం లేదని అర్ధం అయింది.అందుకే వీడిని టార్గెట్ చేసుకుని తెలుగు నేర్పిస్తున్నాం.ప్రస్తుతం వాడికి రెండేళ్ళు.మూడేళ్ళ వరకూ జుట్టు తీయరట. అంచేత నా కన్నా పెద్ద జుట్టు ఉంది.వాళ్ళమ్మ సిక్కు పిల్లాడిలా ముడి వేస్తుంది.మొదట్లో నన్ను అమ్మ అనేవాడు.ఈ మధ్యనే తోబాంటీ అనడం నేర్చుకున్నాడు.ప్రీ- స్కూల్ కి వెళుతున్నాడు.పుస్తకాలు తెచ్చి అన్నీ చెప్పమంటాడు.టిన్నుతో తెగ ఆడతాడు.వాళ్ళ నాన్నని పప్పా అంటాడు.వాడిని ఏమడిగినా ఇవ్వడు. 'నాదీ' అంటాడు.మనవి ఇవ్వకపోతే ఊరుకోడు.చేతిలో ఉన్నవి విసిరేస్తాడు.కంప్యూటర్ లో పాటలు వినడం,చాటింగ్ చేయడం ఇష్టం.వాడికి వచ్చిన తెలుగు మాటల్లో లోపల,పైన,తుబ్బయ్య (సుబ్బయ్య-మా కుక్),కావాలి,అన్న ...ఇలా ఉంది.వాడిద్వారా వాళ్ళ అమ్మకీ కాస్త తెలుగు రావడం విశేషం.పనమ్మాయి రమ అంటే వాడికి చాలా ఇష్టం.వెళుతుంటే ఏడుస్తాడు.వాడికి ఐదో నెల నుంచీ అలవాటు.ఇంతకీ వాడి పేరు చెప్పలేదుకదూ!దేవ్.నేను ముద్దుగా దేవులూ,దేవయ్యా అంటూ ఉంటా.

7, నవంబర్ 2010, ఆదివారం

దీపావళి..ఒబామా.. మా టిన్నుబామా...

అబ్బ ! దీపావళి పండగ కూడా అయిపోయింది.అందుకే ఇంత సమయం.అర్ధం అవుతుందిలే.అందరూ పండగ బాగా చేసుకున్నారుకదా! సురక్షితంగా.. ఈ సారి మా వాడు చాలా డబ్బులు కాల్పించాడు . రకరకాల టపాకాయలు,రాకెట్లు.. ఎన్ని కాల్చినా సరిపోదు.మళ్ళా స్కూళ్ళు మొదలయ్యాయి.రేపటినుంచి మా వాడికి యూనిట్ టెస్టులు.అదేమిటో, ఏ ట్యూషన్ మా వాడికి నచ్చడం లేదు.నేనే తంటాలు పడాల్సి వస్తోంది.నిన్న జుట్టు ట్రిం చేయించు కోరా అంటే వెళ్లి ఒబామా కట్ అని గుండులా చేయించు కుని వచ్చాడు.( ఒబామా మీద అభిమానం కాదు.పొట్టి జుట్టు అంటే ఇష్టం)చలికాలం ఎవరైనా అలాచేస్తారా?చాలా కోపం వచ్చింది.కాసేపయ్యాక వాడికీ తెలిసింది బాగా లేదని.బిక్క మొహం వేసాడు.వాళ్ళ నాన్న ఏమో ఆ అదే పెరుగుతుందిలే అనేసాడు తేలిగ్గా .ఏదో ఓదార్చి పంపా స్కూలుకి.ఇంటికొచ్చాక తెలుస్తుంది ఎలా ఉందొ.అసలు చిన్నపిల్లలకు ఎంత జుట్టు ఉంటె అంత అందం. కానీ మా వాడు,వాళ్ళ నాన్న ఇద్దరూ కాస్త జుట్టు పెరగగానే కటింగ్ షాప్ పరుగెడతారు. అదేమిటో!ప్రస్తుతానికి మా వాడిని టిన్నుబామా అని వెక్కిరిస్తున్నా ...ఓ.కే .బాయ్.

19, అక్టోబర్ 2010, మంగళవారం

కేరళ...కథాకళి...భళీ!






అబ్బో, చాలా రోజులయింది బ్లాగుని చూసి.ఏమి చెయ్యను? మా టిన్ను పరీక్షలు.అవి అయ్యాక షిర్డీ వెళ్లి సాయి దర్సనం చెసుకున్నా.వచ్చిన వెంటనే కేరళ వెళ్ళాం.రాగానే పండగ.స్కూళ్ళు తెరిచే హడావుడి.ఇవాళే వచ్చా ఆఫీసుకి. కేరళ గురించి నాలుగు ముక్కలు చెప్పాలనిపించింది బ్లాగ్గర్లకు.రేపు ఫోటోలు లోడ్ చేస్తా.అప్పుడు అందరికీ వెళ్ళాలని అనిపిస్తుంది.ఎప్పటినుంచో కేరళ వెళ్ళాలని ప్రయత్నం.ఇన్నాళ్ళకు కుదిరింది.హైదరాబాదు నుంచి కొచ్చిన్ కి గంటన్నర ప్రయాణం (విమానంలో).అక్కడినుంచి కారులో మున్నార్ వెళ్ళాం.చాలా బాగుంది.అంతా టీ తోటలే.ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగుతుంది.జలపాతాలూ మధ్యలో పలకరిస్తాయి.మున్నార్లోఅలా తిరుగుతూ ఉండచ్చు.మంచు తాకుతూ ఉంటుంది.అక్కడ నేషనల్ పార్క్ చాలా ఎత్తున ప్రక్రుతి అందాలతో కనువిందు చేస్తుంది.పెద్ద జంతువులేమి కనిపించవు. తర్వాత టీ ఫ్యాక్టరీ చూసి, పొడి కొన్నాం.టీ తోటల మధ్య ఫోటోలు దిగాం. అక్కడ సరవన్ భవన్ లో టిఫిన్లు,భోజనాలు బాగున్నాయి.హోటల్ దగ్గర మసాజ్ సెంటర్లు ఉన్నాయిగాని మేము వెళ్ళలేదు.మర్నాడు తెక్కేడి వెళ్లాం.అక్కడ మార్షల్ ఆర్ట్స్ ,కథాకళి షో చూసాం.బాగా నచ్చాయి.పెరియార్ నదిలో బోటింగ్ చాలా బోరింగ్ గా ఉంది.పైగా దానికోసం చాలా కష్టపడి టికెట్లు తీసుకున్నాం.ఒక్క జంతువూ కనపడలేదు. ఆ మర్నాడు కుమారకోవ్ వెళ్ళాం.అక్కడ హౌసు బోటు లో వెళ్ళాం.అలా తిప్పుతూ అలెప్పి దగ్గర ఆపి భోజనం పెట్టారు.అంతా కుర్రాళ్ళే.చక్కగా వందారు.రెండు బెడ్రూములు,కిచెను, డైనింగ్ టేబుల్.. అన్ని హంగులూ ఉన్నాయా బోట్లో.రాత్రికి వేచ్చూర్ అనే ఊరి దగ్గర బోటు ఆపేశారు.మేము ఆ ఊళ్లోకి వెళ్ళాం.అక్కడ కృష్ణుడి గుడి ఉంది.చాలా బాగుంది.ఆ రాత్రి బోటు లోనే మకాం.తిని పడుకుని లేచి తయారయ్యి టిఫిన్ తినేసరికి మళ్ళా బయలుదేరిన చోటుకు వచ్చేసాం.మాకోసం కార్ రెడీగా ఉంది.బోటు కుర్రాళ్ళకి బై చెప్పి కొచ్చిన్ వచ్చాం.అక్కడ కాసేపు తిరిగి ద్వారకా అనే హోటల్లో భోజనం చేసాం.చాలా బాగుంది.వెళ్లేముందు కేరళలో ఫుడ్ ఎలాగా అని భయపడ్డ గానీ, మాకు అన్ని చోట్లా బాగానే శాకాహార భోజనం దొరికింది.మా డ్రైవర్ కూడా చక్కగా అన్నీ తిప్పాడు.అక్కడ దొరికే మసాల ద్రవ్యాలు చాలా కొన్నా. కొచ్చిన్లో షాపింగ్ చేయడానికి టైం సరిపోలేదు.ఆ పచ్చదనాన్ని మనసులో నింపుకొని బై కేరళ అని విమానం ఎక్కేసాం.

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గణేశా!రక్షించు కాలుష్యం బారి నుంచి...

అంతా ప్రశాంతంగా ముగిసింది. పిన్న,పెద్ద తేడా లేకుండా వర్షం లెక్క చేయకుండా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు.వేలకొలది విగ్రహాలు నీట మునిగాయి.ఇప్పటి హుస్సేన్ సాగర్ చూస్తె ఒక రకమైన ఆవేదన కలుగుతోంది.కొన్ని విగ్రహాలు నిస్సహాయంగా నీటిలో తేలుతున్నాయి.నీటిలో కరగలేక మరికొన్ని కొట్టుకు వస్తున్నాయి.టన్నులకొద్దీ చెత్త.వస్తూనే ఉంది.రోడ్లపై అడ్డంగా వేసిన పందిళ్ళు ఇంకాతీయలేదు.వాహనదారులు విసుక్కుంటూ వెళ్తున్నారు.భక్తీ పేరిట ఇంత హంగామా అవసరమా?చిన్న చిన్న మట్టి విగ్రహాలు,రకరకాల ఆకులతో పూజిస్తే దేవుడికీ,మనకూ ఎంత మంచిదో కదా!ఆ విషయం వీర భక్తులకు చెప్పేదెవరు?ప్రభుత్వానికీ ఎంత ఖర్చు?పోలీసు ఏర్పాట్లకు,క్రేన్లకు ఎంతెంత ఖర్చు?అదంతా అలా ఉంచితే హుస్సేన్ సాగర్లో పేరుకున్న కాలుష్యం ఎవరు తొలగించగలరు?దేవుడా?నువ్వే రక్షించాలి.

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

జై గణేష్ !జై జై గణేష్ !

గత వారం రోజులుగా మా అపార్ట్మెంట్ లో గణేష్ పూజలతో కొంచెం బిజీ గా ఉన్నాను.ఇదొక్కటే మా కాంప్లెక్స్ లో బాగా చేసేది.పిల్లల హడావుడి చెప్పనే అక్కరలేదు.వాళ్లకి గేమ్స్ ,ఇతర పోటీలు పెట్టాలి కాబట్టి నేను బిజీ అన్నమాట.నిన్న పొద్దున్న నిమజ్జనం, రాత్రి డిన్నర్.రోజూ ప్రసాదాలు చేయడం,పురమాయించడం,అంతా కలసి మాట్లాడుకుంటూ తినడం..మజా వస్తుంది సుమా! అసోసియేషన్ లో ఉన్నాం కాబట్టి కొన్ని పనులు తప్పవు.అయితే పిల్లల పోటీల గిఫ్టులు కొనడమే అన్నిటికన్నా పెద్ద పని.రకరకాలు చూసి కొనాలి.ఇన్నాళ్ళు మాకు మైక్ లేదు. కొనడానికి సవాలక్ష ఇబ్బందులు.చివరికి నేనే దానం చేశా.దాంతో పిల్లలు ఉత్సాహంగా పాటలు పాడారు.మా టిన్నుమిమిక్రీ కూడా చేసాడు.పిల్లలు ఫాన్సీ డ్రెస్ పోటీ బాగా జరిగింది. ఆ విధంగా మా వినాయక చవితి ఉత్సవాలు ముగిసాయి. పిల్లల కేమో దిగులు.గణేష్ వెళ్లిపోయాడని.ఇక క్వార్టేర్లీపరీక్షలకి చదవాలికదా! అదీ అసలు దిగులు.నాకయితే పెద్ద భారం దిగిన ఫీలింగ్ . కొంత వెలితి ఉంటుంది.అది తప్పదు

30, ఆగస్టు 2010, సోమవారం

దేవుళ్ళూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే!

హాయ్, హలో, ఆదాబ్ ! చాలా రోజులయింది కదా అని కొంచెం దీర్ఘంగా పలుకరించా అంతే.ఇంతకీ విషయం లోకి వస్తే,నిన్న స్టూడియో-ఎన్ లో కాల్ సెంటర్స్ మీద ఒక స్టొరీ ఇచ్చారు.అందులో పాల్గొన్న ఒక సి.ఈ. ఓ. ముఖం మీదకి పడుతున్న జుట్టు,చిన్న గడ్డం తో ఈనాటి యువతకి అచ్చమైన ప్రతినిదిలా ఉన్నాడు. పబ్ కి వెళ్ళబోయి చర్చకి వచినట్టే ఉన్నాడు.అసలు దానిద్వారా ఏం చెప్పాలనుకున్నారో తెలియలేదు.సరే ఆ విషయం అలా ఉంచితే మా ఫ్రెండ్ మంచి ఎస్ ఎంఎస్ పంపింది.దాని ప్రకారం దేవుళ్ళు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులే.అదెలాగంటే,...
బ్రహ్మ:సిస్టం ఇన్ స్టాలర్
విష్ణు: సిస్టం సపోర్టర్
శివ: సిస్టం ప్రోగ్రామర్
నారదుడు:డేటా ట్రన్స్ఫెర్ (డేటా సరఫరా)
యముడు: డిలీటర(డేటా తొలగిమ్చేవాడు )
మేనక: వైరస్
బాగుంది కదూ !అంచేత ఈ సాఫ్ట్ వేర్ ఇప్పుడే ఉందని ఆయా ఉద్యోగులు సంబరపడనక్కరలేదు.

25, ఆగస్టు 2010, బుధవారం

అనురాగ బంధం - రాఖీ

నిన్న రాఖీ పండుగ హడావుడిగా గడిచిపోయింది.మా తమ్ముడు (ఏకైక)వచ్చి నా చేత మూడు రాఖీలు కట్టించుకున్నాడు.ఒకటి నాది, రెండు మా అక్కలవి.ఎప్పుడూ అంతే. mఉగ్గురి తరఫునా నేనే కడతా. వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ వేస్తారు.ఇంక విజయవాడలో నాకు దేవుడిచ్చిన అన్నలు కొందరు ఉన్నారు.చిన్నప్పటి నుంచీ అన్నయ్య లేడేఅనే బాధ కొంచెం ఉండేది.స్కూల్ లో ఉండగా వారితో పరిచయం.ఇప్పటికీ కొనసాగుతోంది.నిజంగా చాలా ప్రేమగా ఉంటారు.పొరపాటున రాఖి పంపడం ఆలస్యమయితే బాధపడతారు.అందుకే ఈ సారి ముందే పంపాను.నాకు ఎప్పుడూ వీలయినంత ఎక్కువమందికి కట్టడం అలవాటు.అలా అని అందరికీ కట్టను.వాళ్ళలో నాకు సోదరభావం కనిపించాలి.ఈ సారి విజయవాడ నుంచి మా అన్నలు బోకే పంపారు.మా టిన్ కి వాళ్ళ చెల్లి (మా మరిది కూతురు)ద్యుతి రాఖి పంపింది.ఉన్నంతకాలం సుఖసంతోషాలతో జీవించమని దీవించిన రాజకుమార్అన్నయ్య దీవెన చాలా సంతోషం కలిగించింది.స్కూల్ లో ఉన్నప్పుదయితే చాలా హడావుడి.పొద్దున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్లి కట్టేదాన్నిమా తమ్ముడికీ ఇప్పటిదాకా ఎప్పుడూ కట్టకుండా లేను.వాడు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు పోస్ట్ లో పంపేదాన్ని.వాడుకూడా చాలా ప్రేమగా ఉంటాడు.చిన్నప్పుడు మా నాన్న నన్ను కొడితే వాడు ఏడ్చేవాడు.(ఆ విషయం మీద చాల జోకులు ఉన్నాయి).నా లాగే అందరూ అనురాగాల రాఖి పండుగ బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను.

12, ఆగస్టు 2010, గురువారం

లక్ష్యం లేని జీవితం

చాలా మంది నీ లక్ష్యం ఏమిటి అని అడుగుతూ ఉంటారు.లక్ష్యం ఉంటేనే జీవితంలో బాగా ఎదగవచ్చనికూడా అంటూ ఉంటారు.నాకు ఏమి చెప్పాలో తోచదు.ఎందుకంటే నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు.ఉద్యోగంలో చేరేవరకు నాకు ఈ విషయం మీద ప్రత్యేకంగా ఒక అభిప్రాయం అంటూ లేదు.అసలు అదే కాదు.చదువు విషయంలోనూ అంతే. టెన్త్ వరకు తెలుగు మీడియం లో చదివా.తర్వాత ఏకంగా ఎం.పి.సి.గ్రూపు తీసుకొని ఇంగ్లీష్ మీడియం లో చేరా(టెన్త్ లో లెక్కల్లో మార్కులు తక్కువే ).మొదటి సంవత్సరం ఆడుతూ,పాడుతూ గడిపేసా.రెండో ఏడు బాగానే చదివా.ఫస్ట్ క్లాసు వచ్చింది .అబ్బో, ఇంకేముంది అని ఎంసెట్ రాసా.పది,పదకొండు,పన్నెండు మార్కులు వచ్చాయి. (ఇప్పటికీ మా ఇంట్లో వెక్కిరిస్తారు) పోనీ అనుకుని బీకాం లో చేరా.చాలా తేలిగ్గా చదివేదాన్ని.అలా పాసవుతూ థర్డ్ ఇయర్ లో స్టాటిస్టిక్స్ లో తప్పా. నిజంగా షాక్.మిగిలినవన్నీ తొంభైల పైనే వచ్చాయి.రెండు రోజులు ఏడ్చా .మళ్ళా రాసి పాసయినా ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్స్ లో డిప్లొమా చేశా. అప్పుడే ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రకటన చూసా.అసలు నాకన్నా మా అక్క కి జర్నలిస్ట్ కావాలని ఉండేది.అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలకీ వెళ్ళింది.బాడ్ లక్. రాలేదు.ఒకరకంగా మంచిదే.ఆ కుళ్ళు అంటకుండా బతికిపోయింది. నాకు ఈనాడులో సీటు వచ్చింది.అస్సలు ఇష్టం లేదు వెళ్ళడం.ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో వెళ్ళా.ఇంటర్వ్యూలో రామోజీ రావుగారు,బూదరాజు రాధాకృష్ణ వంటి ప్రముఖులు ఉన్నారు.(అప్పటికి నాకు వారి గురించి ఏమీ తెలిదు)నిర్భయంగా ఏదోదో మాట్లాడా. అదే వారికి నచ్చింది.సీటు వచింది.ఆరునెలలు హాస్టల్ లో ఉన్నా. జీవితంలో ఎప్పుడూ చదవనంతగా చదివా.ఇక్కడా చివరకు అన్యాయం జరిగింది.అన్ని పరీక్షలలో ముందున్న నేను ఫైనల్ లో బి గ్రేడుకు పడిపోయా.రాంక్ వస్తుందనుకుంటే అలా అయింది.రామోజీ చేతుల మీదుగా రాంక్ హోల్డర్ గా సర్టిఫికేట్ నందుకుంటాను అనుకుంటే అలా అయింది.గంట సేపు ఏడిచా.తర్వాత తెలిసింది కౌంటింగ్ లో పొరపాటు చేసారని.ఏమి లాభం?అప్పటికే నష్టం జరిగిపోయింది కదా ! పోనీ ,ఉద్యోగం అన్నా విజయవాడలో ఇస్తారేమో అనుకుంటే హైదరాబాదులో ఇచ్చారు.వసుంధర పేజీలో పన్నెండేళ్ళు పనిచేసా.మొదట్లో బాసుల నుంచి సహకారం ఉండేది కాదు.నాకేమో మొదటిసారి పని చేయడం.ఎక్కువ అవకాశాలు వచ్చేవి కావు.అదేమని అడిగితె ఇంకా చెత్త పని ఇచ్చేవారు.ఉత్తమ జర్నలిస్ట్ అవుదామనుకుంటే ఇలా ఉందేమిటి అనుకునేదాన్ని.సెలవు అడగాలంటే భయం.ఎం.బి.ఏ చేసి ఇక్కడినుంచి వెల్లిపోదాం అనుకుంటే ,అదీ పూర్తి కాలేదు.చాలా సార్లు నిర్మొహమాటంగా మాట్లాడే నా ధోరణి కూడా కొంత ఇబ్బందులు తెచ్చి పెట్టేది. అయితే ఏ బాధ అయినా ఆ క్షణమే ఉండేది.అదో సుఖం.మెల్లగా నా మారింది.కొంత తెలివితేటలూ అబ్బాయి. రామోజిగారి అబ్బాయి కిరణ్ పత్రిక బాధ్యతలు తీసుకున్నాక నాకు కొన్ని మంచి వార్తలు రాసే అవకాసం వచ్చింది.అందుకుగానూ ప్రసంసలూ దక్కాయి.వసుంధర పేజీ ద్వారా మహిళల సమస్యలు ఎన్నో తెలుసుకునే అవకాసం వచ్చింది.కొన్నాళ్ళకు నన్ను అక్కడినుంచి సిటీ పేజీకి వేసారు.అక్కడ నేను ఏం చేస్తాను?టీవీ ప్రోగ్రాములు ఇచ్చే పేజీ చూడాలి.ఇదీ ఒక పనేనా?మళ్ళా నిరాస.కానీ అక్కడి బాసు చాల మంచి వ్యక్తి. తగిన స్వేఛ్చ ఇచ్చారు. దాంతో తెగ రాసేదాన్ని.నేను మానేసిన సంవత్సరం దాకా ఆ కధనాలు వాడుకున్నారంటే ఎన్ని రాసి ఉంటానో ఊహించండి.సరే,అదీ విసుగ్గా అనిపించింది.కొన్నాళ్ళు సెలవు పెట్టా. స్కూటీ ఆక్సిడెంట్ అయి చెయ్యి విరిగింది.ఆ దెబ్బతో ఉద్యోగం మానేసా. వసుంధర ప్రభావంతో కొన్నాళ్ళు ఈటీవీ లో ప్రోగ్రామ్స్ చేశా.ఇంతలో నల్సార్ యూనివెర్సిటీ వారి ఫ్యామిలీ కోన్సేల్లింగ్ కోర్సు ప్రకటన చూసా.అప్లై చేశా.ఆరునెలల కోర్సు పూర్తీ అయ్యాక ఫ్యామిలీ కోర్ట్ కేసులు చూసేదాన్ని.రెండేళ్లకు ముప్ఫై శాతం జంటల్ని కలిపా.ఆ ధైర్యంతో సొంతంగా సెంటర్ పెట్టా.వందలకొద్దీ వస్తున్నారని చెప్పను.కానీ, వచ్చినవారు సంతోషంగా వెళ్ళేటపుడు తృప్తిగా ఉంటుంది.ఇప్పటికి అదే నా లక్ష్యం.మరి లక్ష్యం లేకపోవడం వలన నేను నష్టపోయానా? అంచేత నేను చెప్పేది ఏమిటంటే ఎప్పటికప్పుడు మన అవకాసాలను బట్టి ముందుకుసాగాలే కానీ,అనుకున్న లక్ష్యం సాధించలేదని ఆగిపోకూడదు.

4, ఆగస్టు 2010, బుధవారం

టాం అండ్ జెర్రీ ...తల్లీ బిడ్డా ...



ఈ మాట ఎవరైనా ఒప్పుకోవలసిందే .కావాలంటే పరిశీలించండి. టాం జెర్రీ వెనకాల ఎలా పరుగులు పెడుతుందో అచ్చంగా అలాగే ప్రతి తల్లీ తన పిల్లవాడి/పిల్ల వెంట పరుగెడుతూ ఉంటుంది.ఆనక చిన్ని క్రిష్ణుదనిమురిసిపోయి అందరికీ చెప్తూ ఉంటాం గానీ పరుగెత్తే టైములో వచ్చే విసుగు,చిరాకు అంతా ఇంతా కాదు.ఇది చూసి కాదు, స్వానుభవంతో చెప్తున్న మాట. మా టిన్ను ఉన్నాడే , వాడు అచ్చం జెర్రీ టైపు. వాడి కి ఇష్టమైన పాత్ర కూడా.ఇక నేను,వాడు ఆ రెంటితో పోటీ పడుతూ ఉంటాం. ఇప్పుడు మా వాడికి పదేళ్ళు.అయినా అదే అల్లరి.పొద్దున్నే వాడిని లేపటంతో మా షో స్టార్ట్ అవుతుంది.పళ్ళు తోముకో, పాలు తాగు ... అంటూ వెంట పడతా.వాడు నిద్ర వస్తోంది అంటూ ఉంటాడు.అది అయ్యాక స్నానం.రెడీ అవడం.వాళ్ళ నాన్న వి ఆ పనులు.అంచేత త్వరగానే అయిపోతాయి.ఈ లోపు నేను వంటింట్లో కుస్తీ పడివాడి కోసం మంచి టిఫిన్ రెడీ చేస్తా.తినమని వెంట పడతా.ఆకలి లేదు అంటాడు. పండు తినమంటా.అబ్బే,కుదరదు అంటాడు. ఇంతలో ఆటో వచ్చేస్తుంది. వెక్కిరిస్తూ వెళ్ళిపోతాడు.అలసిపోయి సోఫాలో కూలబడతా
స్కూల్కి రోజూ వెళ్తాడుకానీ, సెలవు వస్తే బాగుండని రోజూ కోరుకుంటాడు.ఇక వాడికి ఏవన్నా బొమ్మలు కావాలంటే,మా వెనకాలే తిరిగి జెర్రీ లాగే తను అనుకున్నవి సాధిస్తాడు. వాడు చెప్పేవి వినాలిగానీ మనం సలహా ఇవ్వకూడదు.అడిగితేనే ఇవ్వాలి.వాడు ఎవరిని తిట్టినా ఊరుకోవాలి.చదువుకోమని చెప్పకూడదు.చదువు అనగానే అంతవరకు హుషారుగా కబుర్లు చెప్పేవాడు కాస్తా దిగాలుగా అయిపోతాడు.నన్ను శత్రువులా చూస్తాడు.ఎలాగో రాజీ పడి మళ్ళా ఫ్రెండ్స్ అవుతాం.రాత్రి అన్నం తినమంటే పరుగు మొదలు.ఏవేవో కారణాలు చెప్తాడు.అసలు అన్నం దగ్గర,చదువు దగ్గర మా వాడు ఎప్పటికైనా అయిదు నిమిషాలైనా కూర్చుంటాడా అని డౌట్.చిన్నప్పుడు మా అమ్మ కధలు చెప్తూ అన్నం పెట్టేది.ఇప్పుడు వాడు కధలు చెప్తూ తినడం మానేస్తున్నాడు.చదువు దగ్గరకూడా వాడిని కూర్చోబెట్టడం మహా కష్టం. ఒక నిమిషానికే అన్నీ వచ్చేసాయంటాడు.అదే ఆడుకోమనిచెప్పామా ఇక అసలు పట్టుకోలెం. కానీ ఏ మాట కా మాటే.మా టిన్ను షటిల్ చాలా బాగా ఆడతాడు.ఈ మధ్య మొదటిసారిగా హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాడు. స్కూలులో సరేసరి. అన్ని ఆటల్లో ఉంటాడు.కిందటిసారి 'బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అఫ్ ది ఇయర్ ' అవార్డ్ స్కూలులో అందుకున్నాడు.పాటలూ బాగా పాడతాడు.కానీ, వాళ్ళ స్కూలు వాళ్ళు ఈ సారి అంత ప్రోత్సాహం ఇవ్వడం లేదు. అన్ని ప్రైజులు వచ్చినా స్కూల్ మ్యాగాజీన్లో వాడి ఫోటో అయినా వెయ్యలేదు.పైగా కొందరు టీచర్లు ఊరికే కొడుతున్నారు.చిన్నపిల్లల్ని ఎందుకలా కొట్టడం చెప్పండి.వింటున్న నాకే ఇంత బాధగా ఉంటే, పిల్లలకు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎంతగా నేను,టిన్ను టాం అండ్ జెర్రీ లా ఉన్నా నేను, మధు ఇప్పటిదాకా వాడిని ఒక్కదెబ్బ కూడా వెయ్యలేదు.మరీ కోపం వస్తే తిడతా. అంతే.

3, ఆగస్టు 2010, మంగళవారం

ఇంకా బాల్యమేకదా !

ఈ రోజు ఉదయం ఎఫ్.ఎం రేడియోలో బాల్యంలో జరిగిన సంఘటనలపై మాట్లాడమని శ్రోతలకు టాపిక్ ఇచ్చారు.నాకు పొద్దున్నే మా టిన్నుకి టిఫిన్ తయారుచేస్తూ రేడియో వినడం అలవాటు.వాడు 8కి వెళ్ళాక కూడా వింటూ ఉంటాను.నాకూ నా బాల్యం గుర్తు వచ్చి మధుతో ఇలా అన్నాను.'బాల్యం బాగుంటుంది నిజమే కానీ, ఆ విషయం పెద్దయ్యాకే కదా తెలిసేదీ " .వెంటనే మధు 'అదేమిటీ!నువ్వు బాల్యంలోనే కదా ఉన్నావు ' అన్నాడు ఆశ్చర్యంగా,ఒకింత అమాయకంగా ముఖం పెట్టి. నవ్వేసా. కాసేపు అయ్యాక నీ చిన్నప్పటి గుర్తున్న జోక్ ఏమిటి? అని అడిగా(నాకు బుధ్ధి లేక)చాలా ఆసక్తిగా. తను కూడా అంతే సీరియస్ గా ముఖం పెట్టి 'బాల్యంలోనే వౄధ్ధాప్యం రావడం' అన్నాడు.పావుగంట సేపు కళ్ళళ్ళో నీళ్ళు వచ్చేలా నవ్వుతూనే ఉన్నా.అలా వ్యంగ్యంగా జోకులు వేయడంలో మా వాడు భలే దిట్ట.ఎవరికీ తెలియదుకానీ ఇక్కడ కొంచెం విషాదమూ ఉంది.చిన్నతనంలోనే మీదపడ్డ బరువుబాధ్యతలు గుర్తు వచ్చి కూదా అలా అన్నాడని నాకు అర్ధమైంది.

26, జులై 2010, సోమవారం

ఎన్నేళ్ళకు?...మా విజయవాడలో?...



మా ఊరు విజయవాడ. అసలయితే మాది కోనసీమ.అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారం.కానీ మా నాన్న ఉద్యోగరీత్యా విజయవాడకు వచ్చామన్న మాట. మా చిన్నతనంలో గాంధీనగరలో ఉండేవారం.మూడంతస్తుల మేడలో కింద మూడుగదుల పోర్షన్లో ఉండేవారం. పక్క పోర్షన్ల వారి పిల్లలు, ...సరదాగా ఉండేది. క్రమేణా వారిలో చాలా మంది ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు.మేము కూడా ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. కొన్నాళ్ళకు అదీ తగ్గింది.పెళ్లిళ్లకు ,ఇతర శుభకార్యాలకు కలిసేవాళ్ళం.అయితే ఆ రోజులు మేము మరచిపోలేదు.మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో స్థిరపడింది. విజయవాడలో ఇల్లు షాప్స్ చేసాం.ఒక పోర్షన్ మాత్రం ఉంది.ఈ మధ్య నాకు,మా అక్కకి విజయవాడ వెళ్ళే ఛాన్స్ దొరికింది.మా తమ్ముడు కూడా వచ్చాడు. చిన్నతనంలో బాబాయ్ హోటల్ కొంచెం తెలుసు.హైదరాబాద్ లో చట్నీస్ హోటల్ లో బాబాయ్ ఇడ్లి తిన్నాక తప్పకుండా విజయవాడ వెళ్లి తినాలనుకున్నా.అందుకే వెళ్ళగానే బాబాయ్ హోటల్ కి పరుగెత్తా. ఇడ్లీ తిన్నా. gఒప్పగా అనిపించలేదు. ఫోటోలు తీసా.మరి అందరికీ చూపాలికదా. అక్కడినుంచి నేను,మా నాన్న,కుమార్ (తమ్ముడు),బన్ను (అక్క కొడుకు), టిన్ (మా అబ్బాయి) మా పాత ఇంటికి వెళ్ళాం. ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది.గేటు కూడా.చిన్నప్పుడు ఆ గేటు దగ్గర ఫోటో దిగాం. అందుకని మరోసారి ఫోటో దిగాం.ఆ మర్నాడు చిన్నప్పుడు మా పక్కన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలా మూడురోజులు చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నాం. ఎంత సంతోషం అనిపించిందో?నా ఫ్రెండ్స్ అందరినీ కలిసాను. ఇంక కొందరిని కలవలేక పోయాను. ఈసారి ప్రయత్నిస్తాను.ఇంతకీ నేను చెప్పేదేమిటంటే, యాంత్రిక జీవితంలో నేను, నా జీవితం అనుకోకుండా అప్పుడప్పుడు ఇలా చిన్నప్పటి నేస్తాలను కలుసుకుంటే, నువ్వు-నేను-మనం అనుకోవచ్చు కదా !

19, జులై 2010, సోమవారం

ఎవరికోసం?

హాయ్, హలో ,గుడ్ మార్నింగ్! కాని ఇవాళ చాల కోపంగా,బాధగా ఉంది.అసలు పిల్లలకు చదువులు వస్తాయా అని బెంగగా ఉంది.లేకపోతె ఏమిటి?ఎక్కడో బాబ్లిపైన గొడవ అయితే ఇక్కడ స్కూల్స్ మూసేస్తే , ఏమొస్తుంది? ఇంగితం అనేది రాను రాను తగ్గిపోతోంది.మా ఫ్రెండ్ చెప్పింది చాలా మంది వాళ్ళ పిల్లల్ని వేరే రాష్ట్రాల్లో చేర్పిస్తున్నారట చదువుల కోసం.అంతేకాదు.ఆందోళనలు చేసేవాళ్ళ పిల్లలు హాయిగా వేరే ఊళ్లలో చదువుకుంటున్నారట. పాపం,ఏ పాపం ఎరుగని అమాయక జీవుల పిల్లలు,పెద్దలు ఈ బంధుల మూలంగా నష్టపోతున్నారు.మొన్నటికి మొన్న పరీక్షలలో ఎన్ని శలవులు?దానివల్ల ఎందరో నష్టపోయారు.ఇవన్ని చూసి మా అక్క కొడుకుని చెన్నై లో చేర్పించారు.మొత్తమ్మీద పక్కవాడు బాగు పడుతున్నాడు.మన రాష్ట్రం నష్టపోతోంది. అసలు ఈ రాజకీయ వాదులను ఎక్కడన్నా వదిలేయాలి.లేకపోతె, వెళ్లి మహారాష్ట్రలో బందు చేయడమో, నిరాహారదీక్ష లాంటివి చేయాలిగాని ఇక్కడ ఏమి చేస్తే మాత్రం ఏం లాభం?కేవలం,కుటిల రాజకీయాలతో, ప్రచారం కోసం చేసే గిమ్మిక్కులతో ఇబ్బందుల పాలయ్యేది సామాన్య ప్రజలే.

13, జులై 2010, మంగళవారం

దేవుడా!కాపాడు

హాయ్ , గుడ్ మార్నింగ్ !ఈ రోజు ఏం చేస్తున్నారు? మరేమీ లేదు. సాధారణంగా వేసుకునే ప్రశ్నే ఇది.ఒక్కోరోజు ఏం చేయాలో అర్ధంకాదు. మాములుగా రోజు చేసే పనులు చేయబుద్ధి కాదు.మూడ్ కొంచెం చికాకుగా ఉంటుంది.అలా ఎలా ఉంటుంది కారణం లేకుండా అనద్దు .రాత్రి చాలా సేపు నిద్ర పట్టలేదు.మన ప్రమేయం లేకుండా ఎవరైనా మనల్ని నిందిస్తే ఎలా ఉంటుంది?అలా నేను కూడా ఒకరి కారణంగా బాధ పడాల్సి వచ్చింది. నువ్వు, నేను, మనం అనుకుంటూ , అంతా మనవారే అని మరీ ఫీల్ అయితే ఇలాగే ఉంటుందేమో . అసలు నాకు అర్ధం కాని విషయం చదువుకున్నవారు, మంచి, చెడు తెలిసిన వాళ్ళు కూడా మూడో వ్యక్తీ మాటలు ఎలా నమ్ముతారు?ఇది నా ఒక్క అనుభవమే కాదు. నా ఫ్రెండ్స్ అనుభవం కూడా.అదృష్టం కొద్ది నా ఫ్రెండ్స్ , నేను ఏమి అనుకోము. మా స్వభావాలు తెలుసు.ఉద్యోగంలో ఉన్నపుడూ దాదాపు అంతా బాగానే ఉండేవారు.ఇప్పుడు ఇంటిదగ్గర చాలా మంది నా దగ్గరికి సలహా కోసం వస్తూ ఉంటారు.ఏదో నాకు తోచినది చెప్తాను.ఒక్కోసారి వీళ్ళు ఇతరుల మాటలు నమ్మి అపార్ధం చేసుకుంటారు. అప్పుడూ నేను సర్దిచెప్పడానికే ప్రయత్నిస్తాను.నేను ఎవరినీ సలహా కోసం రమ్మని అడగను.ఏదో బాధ పడుతున్నారు కదా అని మాట్లాడితే ఇదే సమస్య.ఆ విధంగా నిన్న నాకు బాధ కలిగిందన్న మాట. పైగా అంతా నువ్వు కౌన్సిలరువి కదా, అంటారు. అంటే , నాకు బాధ ఉండదా ? ఏమిటో ?ఏదో అందరం బాగుండాలి అని నా తాపత్రయం.చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే ఎలా? ఒకచోట ఉంటున్నపుడు కలసి మెలసి ఉండాలి అని , ఎవరి గురించి చెడుగా అనుకోకూడదని ఎలా చెప్పాలి? ఈ ఆలోచనలతో రాత్రి సరిగా నిద్ర పోలేదు. రోడ్డు మీదకు వచ్చేసరికి ఏవో ద్రయినేజి గొట్టాలు పెట్టడం కోసం తవ్వేసారు.రోడ్డు వేసాక తవ్వేబదులు ముందే ఆ పని చెయ్యచ్చు కదా !ఈ వెంకటరమణ కాలనీ ఎప్పుడు బాగు పడుతుందో ఆ ఏడుకొండల వెంకట రమణ కే తెలియాలి.జనాలకు పౌర స్పృహ, ఇరుగు- పొరుగుతో బాగుండాలి, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనే ఆలోచనలు ఎప్పుడు వస్తాయో?దేవుడా,కాపాడు.

12, జులై 2010, సోమవారం

టాయ్ స్టోరీ

హాయ్ మిత్రులారా,అంతా క్షేమమా! గత మూఢు రోజులుగా మా అబ్బాయి షటిల్ టోర్నమెంట్ వల్ల ఏమీ రాయలేదు.జిల్లా స్థాయి పోటీలు.పాపం,క్వార్టెర్ ఫైనల్స్ల్ లో ఓడిపోయాడు.ఓదార్చి టాయ్ స్టోరీ సినిమాకి తీసుకువెళ్ళాను.చాలా బాగుంది. బొమ్మలకూ మనసు ఉంటుందని హ్రుద్యంగా చూపారు. చివరలో కాలేజికి వెళ్ళె అబ్బాయి బొమ్మలను చిన్న పిల్లకు ఇవ్వడం మా టిన్నుకి నచలెదు. తను అలా ఇవ్వడట.తన పిల్లలే ఆడుకొవాలట. మా అబ్బయి దగ్గర చాలా బొమ్మలు ఉన్నయి.స్పైడర్మాన్,సూపర్మాన్, బాట్మాన్,హనుమాన్ ... ఇలా అద్భుత శక్తులు ఉండే వాళ్ళంతా మా వాడికి ఇష్టం. ఒక్కో రకం నాలుగైదు ఉంటాయి. నాకు కూడా బొమ్మలంటే ఇష్టమే. అందుకే కొంటూ ఉంటాం. ఇవాళ లెఖినిలొ చేస్తున్నా. అందుకే అంత త్వరగా రావడం లేదు. రేపు ఎక్కువ మాట్లాడతానే. ఇవాల్టికి బై.

7, జులై 2010, బుధవారం

నాకు తెలిసిన మహా నేత

ఫ్రెండ్స్, ఇవాళ దివంగత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు.ఈ సందర్భంగా నేను నాకు ఆయనతో ఉన్న అనుబంధం మీతో చెప్పాలనుకుంటున్నాను.నిజానికి నాకు ఆయనతో పెద్ద పరిచయం ఏమి లేదు.నా కాలేజ్ రోజుల్లో ఆయన గురించి మొదటిసారి విన్న.అదీ పేపర్ లో.ఎందుకో తెలీదు. ఆయనలో ఒక ఠీవి,రాజసం నాకు కనిపించాయి.చాలా ఏళ్ళు అలాపేపర్లో చదవడమే గానీ పరిచయం లేదు.ఈనాడు పేపర్లో పనిచేస్తున్నపుడు నా భర్త ఒక టీవీ చానెల్ లో రిపోర్టర్ గా పనిచేసేవారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. ఆ క్రమంలో నా భర్తకు ఆయనతో పరిచయం కొంత పెరిగింది.నాకు పరోక్షంగా అభిమానం పెరిగింది.ఎందుకు అంటే చెప్పలేను కానీ కొందరిని చూస్తె అభిమానం కలుగుతుంది అంతే. ఈనాడు వసుంధర పేజి లో ప్రముఖుల భార్యల ఇంటర్వ్యూ ఇచ్చేవారం. మా ఎండీ గారు రాజశేఖర్రెడ్డి గారి భార్య ఇంటర్వ్యూ చేయమన్నారు.అప్పటికే నాకు ఆసక్తి ఉండటంతో నేను ప్రయత్నం చేస్తానన్నాను.నా భర్త ద్వారా సులభంగానే ఇంటర్వ్యూ దొరికింది. రాజశేఖర రెడ్డి గారు, వారి భార్య విజయలక్ష్మి గారు ఎంత బాగా మాట్లాడారంటే, ఇప్పటికీ (సుమారు పదేళ్ళు అయింది) ప్రతిమాటా గుర్తే. మా అబ్బాయిని కూడా దగ్గరికి తీసుకున్నారు. వసుంధరలో వచ్చిన ఆ ఇంటర్వ్యూ నాకు మంచి పేరు తెచ్చింది. అప్పటి నుంచి ఇంకా అభిమానం.ఆయనను ఎవరన్నా విమర్శిస్తే సమాధానం చెప్పేదాన్ని.ఇంటర్వ్యూ లో ఆయన భార్య కోరుకున్నట్టే తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నిక్కచ్చితనం కొంత భయంగా ఉన్నా, అన్నిటా విజయం సాధించాలని కోరుకునేదాన్ని.ఆయనతో చాలా దగ్గరగా ఉన్న నా భర్త ద్వారా నేను మరింత అభిమానం పెంచుకున్నాను. మా ఇంటికి వస్తానని రాకుండానే అనంతలోకాలకు వెళ్లిపోతారని ఊహించలేదు. ఆయన మరణించి సంవత్సరం అవుతున్నా,సమస్యలతో రాష్ట్రం అల్లాడుతోంది . ఇంకా ఎక్కడో ఆశ . ఏదో ఒక రోజు అలా నడచుకుంటూ వస్తారేమో అని. చెప్పేది చేసేవారు కొందరైతే , చెప్పనిదీ చేయడం, స్నేహానికి విలువ ఇవ్వడం, కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం ,నమ్మినవారిని ఆదుకోవడం ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.నాయకుడు ఎలా ఉండాలో చూపిన వ్యక్తి .చాలా మంది ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు అని, రకరకాలుగా అంటారు గానీ, అవన్నీ తప్పే.సన్నిహితంగా చూసిన వారెవరూ ఆయనపై అటువంటివి అనరు.తన లోపాలను కూడా చెప్పేవారు. అటువంటి నాయకులు ఇకముందు ఉండరేమో.అందుకే ఎప్పటికీ నా అభిమాన నాయకుడు డా. రాజశేఖర రెడ్డి.

5, జులై 2010, సోమవారం

ఉద్యోగం ఎందుకు మానేసాను?

నేను ఎప్ప్పుడూ అనుకోలేదు ఒక దినపత్రికలో పని చేస్తానని.సరదాగా ఈనాడు జర్నలిజం స్కూల్ కి అప్లై చేశా. సీటు వచ్చింది. ఆరునెలలు కోర్సు. ఎనిమిది వందలు ఇచ్చేవారు. హాస్టల్ లో ఉండేదాన్ని.చాలా సరదాగా ఉండేది. కాని విజయవాడ నుంచి వేరే ఊరు రావడం అదే మొదటిసారి. దాంతో కొంచెం బెంగగా ఉండేది.కాని తొందరగానే అలవాటు పడ్డాను.కోర్సు అవగానే విజయవాడ లో పోస్టింగ్ ఇస్తారనుకున్న. కాని హైదరాబాద్ ఆఫీసులోనే ఇచ్చారు. వసుంధర మహిళా పేజి లో పనిచేయాలన్నారు. మొదట్లో చాలా కొత్తగా ఉండేది. తర్వాత అలవాటు అయింది. హాస్టల్ లో చాలా విషయాలు నేర్చుకున్న.రకరకాల వ్యక్తులు,స్వభావాలు తెలిసాయి.ఆఫీసు లో కూడా అందరితో ఫ్రీగా మాట్లాడేదాన్ని. దాంతో కొన్ని చిన్న చిన్న అపార్ధాలు. సుమారు అయిదేళ్ళు గవర్నమెంట్ జాబు లా ఎంజాయ్ చేశా. తర్వాత షిఫ్ట్ మార్చారు.అన్నాళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని.రోజు రాత్రి ఎనిమిదింటికి బస్సు లు మారి, మెహదిపట్నం వెళ్లేసరికి తొమ్మిది దాటేది. స్పెషల్ వర్క్ ఉంటె ఇంక లేట్ అయ్యేది.మా బాస్ ఎమన్నా అంటే ఏడుపు వచ్చేది. అయితే పెళ్లి అయ్యాక ఆఫీసు పక్కనే ఇల్లు.హాయిగా ఉండేది. బాబు(టిన్) పుట్టాక కూడా బాగానే పని చేశా.తర్వాత రెండేళ్ళకి మా బాస్ ని మార్చారు. అప్పుడప్పుడే నాకు మంచి ఆర్టికల్స్ రాయడానికి అవకాసం వచింది. వచ్చింది.కాని ఈ కొత్త బాస్ చాల యాంత్రికం.మన బాధలు పట్టవు.అర్ధరాత్రి పన్నెండు అయినా అప్పుడే ఆఫీసుకి వచ్చినట్టు ప్రవర్తించేవాడు.ఒక చిన్న శీర్షికకి గంటలు, గంటలు వేస్ట్ చేసేవాడు. మనకేమో ఇంట్లో చిన్న పిల్లాడు.తెల్లవారుజాము వరకు అలాగే ఉండాల్సి వచ్చేది. మా సీనియర్ వీణ గారి దగ్గర నా అసహనం చూపెదాన్ని.పాపం, ఆవిడ నాకు సర్ది చెప్పేవారు.కొన్నాళ్ళకు నాకు వేరే డెస్క్ బదిలీ అయింది.అక్కడ బాస్ చాలా మంచి ఆయన. కానీ నాకే పని నచ్చలేదు. ఇంట్లో బాబు రోజు ఏడుపే ఆఫీసు మానెయ్యమని.అప్పటికే మా అమ్మ,నాన్న నా గురించి అయిదేళ్ళు మా అబ్బాయి కోసం ఉన్నారు. వాళ్ళు ఊరు వేల్తామన్నారు.ఈలోగా మా శ్రీవారికి బిజీ గ ఉండే ఉద్యోగం వచ్చింది.దాంతో తప్పనిసరి అయి ఉద్యోగానికి రాజీనామా చేశా.ఆ తర్వాత ఎక్కడా చేయలేదు. అదే నా మొదటి,చివరి ఉద్యోగం అయింది.ఇప్పుడు మా వాడు అంటూ ఉంటాడు కావాలంటే వెళ్ళు జాబు కి అని.వాడికి అవసరం తీరిపోయింది కదా ! అయిన ఇంకా అదే ఆఫీసులో చేస్తున్న మా ఫ్రెండ్స్ కష్టాలు చూస్తుంటే మానేసి మంచిపనే చేశా అనిపిస్తుంది.ఆఫీసు మానేసాక కొన్నాళ్ళు బాధగా ఉన్న కుటుంబానికి దగ్గరయ్యాను అనే తృప్తి మిగిలింది.అయినా ఖాళీగా లేకుండా ఫ్యామిలీ కౌన్సేల్లింగ్ కోర్సు చేశాను.ఇప్పుడు సొంతంగా సెంటర్ పెట్టుకున్న. aదన్న మాట నా ఉద్యోగం సంగతి.

1, జులై 2010, గురువారం

వానలో...గోదావరినుంచి హాంగ్ కాంగ్ వరకు...

ఎన్నాళ్ళకు వాన పడింది ? రోజు చాలా చికాకుగా ఉక్కగా ఉంటోంది. అప్పుడప్పుడు మబ్బులు కనబడటమే గానీ చుక్క కురవడం లేదు. నిన్న రోజంతా మబ్బులు ఊరించి చివరకు సాయంత్రం వానగా మురిపించాయి.అలాంటపుడు వేడిగా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే బలే ఉంటుందికదా!అనుకోకుండా నా ఫ్రెండ్ వానలో చిక్కుకుని ఇంటికొచ్చింది. ఆ విధంగా నా కోరిక తీరింది.చూసారా దేవుడు వానని, ఫ్రెండ్ ను కూడా రప్పించాడు.కాలేజీ లో ఉన్నపుడు బుక్స్ ఒకరికిచ్చి అందరం తడుస్తూ ఇంటికేల్లెవాళ్ళం. అమ్మ తిట్టినా సరే.అదో ఆనందం. ఇప్పుడు కూడా వర్షం వస్తే తడవాలనే ఉంటుందికాని కాలుష్యం తో కూడినది ఎందుకులే అని వదిలేస్తున్న.మా అబ్బాయికి అస్సలు వర్షం నచ్చదు. రోడ్లు మురికిగా ద్రయినేజిలన్ని నిండి ఉంటాయికదా ! అందుకే వాన వద్దు అంటాడు.అప్పుడు నేను వాన రాకపోతే ఎంతమంది ఎడుస్తారో వివరిస్త. సరేగాని మరీ ఎక్కువ రాకూడదు అంటాడు.సరే, మనం వాన గురించి కదా మాట్లాడుకుంటున్నాం.గీతాంజలి సినిమా లో జల్లంత కవ్వింత కావాలిలే పాట చాలా ఇష్టం. మణిరత్నం సినిమాల్లో వాన బాగుంటుంది.శేఖర్ కమ్ముల ఆనంద్లో కూడా.గోదావరిలో వాన పాట ....అబ్బో చెప్తే చాలానే ఉన్నాయి.గోదావరి చూసి పట్టుబట్టి పాపికొండలు వెళ్ళాం రాజమండ్రి నుంచి మా ఫ్యామిలీ అంత. దారిలో పేరంటాల పల్లి దగ్గర ఇంకో బోటు రావాలి. అది ముందే వచ్చి వెళ్ళిపోయింది.మేము భద్రాచలం వెళ్ళాలి.రాజమండ్రి నుంచి వచ్చిన బోటు అదేదో కల్లూరు అనే చోట దింపేసి వెళ్ళిపోయింది.అక్కడ అన్ని వెదురు కాటేజీలు ఉన్నాయి.అక్కడి ఒనర్ని అడిగితె చిన్న పడవ ఇచ్చారు.అది మరో పల్లెవరకే.మేము మొత్తం పదమూడు మంది ఉన్నాం.అక్కడ సెల్ సిగ్నల్ ఉండదు. అందరికి టెన్షన్.మధు (నా భర్త) మాములుగా చాలా కూల్ గా ఉంటాడు. కానీ తను కూడా టెన్షన్ పడ్డాడు.అప్పట్లో టీవిలో న్యూస్ చీఫ్ . ముందే తెలిసినవాళ్ళకి చెప్పాడు.వాళ్ళు అప్పటికే మాకోసం వెతుకుతున్నారు.మధు కష్టపడి ఎక్కడికో వెళ్లి ఫోన్ చేశాడువాళ్ళకి .అంతవరకూ మేము ఆ పల్లెలో స్కూల్ లో చీకటిలో కూర్చున్నాం.ఒక గుట్ట ఎక్కి ఆ పల్లె ఎలా చేరామో తలచుకుంటే ఇప్పుడు తమాషాగా అనిపిస్తుంది. మొత్తానికి ఆ విధంగా మా పాపికొండల ప్రయాణం సాగింది.అంతకు ముందు ఒకసారి నేను,మధు,టిన్ వెళ్ళాం.అప్పుడు పడవలో ఉన్నప్పుడు వర్షం వచ్చింది. టిన్ కి భయం వేసింది పడవ మునిగిపోతుమ్దేమో అని.కాని పడవలో వర్షం రావాలన్న నా కోరిక తీరింది.మొన్న మే చివరలో హాంగ్ కాంగ్ వెళ్ళాం. అక్కడ వర్షం.ముందు గొడుగు కొన్నాం. డిస్నీ ల్యాండ్ లో రైన్ కోట్ కొన్నాం.మకావ్ లో వానలోనే .కాని హాయిగా తిరిగాం.ఇవీ ఇవాల్టి నా వాన ముచ్చట్లు.మరి ఉండనా.

27, జూన్ 2010, ఆదివారం

ఎంత కష్టం ? ఎంత కష్టం?

హాయ్ ! అబ్బ చాల శ్రమ పడాల్సి వచ్చింది మల్లీ లైన్లో పడటానికి. ౩ రోజులుగా ఏమి రాయడం లేదుకదా .తప్పు నాదికాదు. నా కంప్యూటర్ దే. ఆఫీసు కి రాలేదుకదా ఇంట్లో చేద్దామనుకున్న.కాని ఎంత ప్రయత్నించిన తెలుగు ఫాంట్ రాలేదు.సరే అని ఇవాళ ఆఫీసులో ట్రై చేస్తున్న. ఏమిటో ఫ్రెండ్స్ ఎవరూ నా బ్లాగ్ చూడటం లేదా? అక్కదికీ విజయశ్రీ కామెంట్ కూడా రాసాను అందే మరి. మా వెంకటరమణ కాలనీలో అస్సలు బాధ్యత లేదు ఎవెరికీ . రోడ్ అంతా వాళ్ళ ఇల్లే అనుకుంటారు.ఎవరి ఇంట్లో పెళ్లి అయిన, చావు అయినా రోడ్ బ్లాక్ చేసేసి వెళ్లేవారికి ఇబ్బంది కలిగిస్తారు. అడిగితె గొడవ చేస్తారని మా పనమ్మాయి చెప్పింది. అంతేకాదు రోడ్ అంత బళ్ళు పార్క్ చేస్తారు. ఎప్పుడూ తిట్టుకుంటూ అలాగే వెళుతూ ఉంటం. ఏమి చేస్తాం? అసలు ఆ రోడ్లోకి పోలీసు లు రారు. అందరూ కార్లు రోడ్మీదే పెట్టి దర్జాగా కవేర్కూడా కప్పుతారు. ఎన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులకి కంప్లైంట్ ఇచానో. ఒక్కసారికూడా స్పందించలేదు.నిన్న ద్రయినేజి వాలకి ఫోన్ చేసిన అంతే. తాపీగా రెండురోజుల తర్వాత రిపేరు చేస్తామంటున్నారు.పేపర్లో మాత్రం ఫోనేనుమ్బెర్స్ ఇచి సేవ చేస్తున్నామని కబుర్లు చెప్తారు.అయినా మనకే బాధ్యత లేదని అలా రోడ్ పైనే బళ్ళు ఆపేసి, ఎవరు పోయినా బ్లాక్ చేస్తే ఏమి చేస్తారులే? చూసారా ఎన్ని కష్టాలో? కరాటే కిడ్ సినిమా చూసా . చాలా బాగుంది. తప్పులుంటే తప్పులుంటే తప్పులుంటే తప్పులుంటే గాడికి తెగ నచ్చింది .అప్పటినుంచి ఇంట్రెస్ట్ పెరిగింది కుడా. అంతకుముందు స్చూల్లో సరిగా చేసేవడుకాడు.ఇప్పుడు రేచిపోతున్నాడు.ఇంకేమిటి విశేషాలు? నిన్న క్రాస్వర్డ్ లో బుక్ కొన్న.పేరు ... గుర్తులేదు. రేపు చెప్తానే .ఇక ఉంటామరి.బాయ్ .

23, జూన్ 2010, బుధవారం

స్నేహాలు ఎన్నో రకాలు

హాయ్ ! ఇదేమిటీ పొద్దున్నే స్నేహాల గురించి మొదలు పెట్టింది అనుకుంటున్నారా ? ఏదో నా అనుభవాలు చెప్దామని . ఇవాళ ఒకటే చెప్తా భయపడొద్దు .నాకు ఏ దయినా ఫ్రాంక్గా చెప్పడం అలవాటు.మనసులో ఉంచుకొని కుమిలిపోవడం అలవాటు లేదు.మా అపార్ట్మెంట్లో లేడీస్ బాగానే స్నేహంగా ఉంటం. అయితే ఒక ఆవిడ చాలా క్లోసేగా మాట్లాడేది. నేనుకూడా అలాగే ఉండేదాన్ని . ఒకరోజు ఆవిడ పెట్టుకున్న బింది బాగాలేదని అన్నాను. అది కూడా ఆవిడ అడిగితేనే చెప్పా. కానీ తను నేను తనని కావాలనే అల అన్నానని , ఆవిడని ఎప్పుడు తక్కువచేసి మాట్లాడతానని అందరితో చెప్పి బాధపడింది.ఇది నాకు తెలిసి షాక్ అయ్యాను. ఎందుకంటే ఆమె నాతొ చాలా ఫ్రీగా ఉందని నా ఫీలింగ్.అయితే తర్వాత ఆమెను కూర్చోబెట్టి నాకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని వివరించాను.అప్పటినుంచి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్న.అదే నా ఫ్రెండ్స్ నేను ఎలా మాట్లాడిన అర్ధం చేసుకుంటారు. కానీ అందరూ అలా ఉండరుగా .అంచేత స్నేహంగా మాట్లాడిన వాళ్ళంతా స్నేహితులు కాలేరని అర్ధం. అప్పటినుంచి ఎదుటివారి దృష్టితో కూడా చూడాలని తెలుసుకున్న.టైపింగ్ ఇంక బాగా ప్రాక్టీసు అయ్యేదకే తక్కువగా రాస్తాను.ఓ.కే కదా .బాయ్

21, జూన్ 2010, సోమవారం

పిల్లలు భద్రం సుమీ?

నిన్న మూడ్ ఏమీ బాగాలేదు. చిన్నపిల్లలు ప్రమాదంలో పోయారు.అసలు వాహనాలు నడిపెవారికి మనసు ఉందా అనిపిస్తుంది. కన్నతల్లి కళ్ళముందే బిడ్డ పొతే ఎంత నరకం? కోట శ్రీనివాసరావు కొడుకు కూడా అనవసరంగా బైక్ పైన వెళ్లి మరణాన్ని తెచుకున్నాడు.హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు మిగిలేవి. ఆ తండ్రి బాధ ఎవరు తీర్చగలరు?అందుకే ఫ్రెండ్స్, రోడ్ మీద వెళ్ళేటపుడు జాగ్రత్త.మీ ఇంట్లో వారిని గుర్తు చేసుకొంటే మేలు. నా పతిదేవుడు నన్ను స్కూటీ nadapaddu amtunnadu . సరే, ఈ బాధ నుంచి relax అవుదామని విల్లన్ సినిమాకి వెళ్ళాను. తలనొప్పి పెరిగింది. మణిరత్నం ఇలా ఎందుకు తీసాడు అనుకున్న.ఇవాళ మా జిం లో అందరు ఈ మూవీని తిట్టడమే.ఇవాళ మా సుజయ్ కి స్కూల్ లేదు.నాతోనే ఆఫీసు కి వచ్చాడు. వాడికి కరాటే కిడ్ సినిమా చూడాలని ఉంది. ఓ.కే అన్నాను.నేను ఆఫీసు లో yఏమి చేస్తానో చెప్పలేదు కదా ! చిన్న ఫ్యామిలీ కోన్సేల్లింగ్ సెంటర్ . అప్పాయింట్మెంట్ తీసుకొని రావాలి. ఎందుకంటే టైం స్పెండ్ చేయాలికద. ఓపికగా ప్రొబ్లెంస్ వినాలి.అందుకే వారానికి ఒకటి లేక రెండు కేసు లు మాత్రమె తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టికి ఇది చాలుకదా

20, జూన్ 2010, ఆదివారం

అందమైన బంధాలు

మనమందరం బంధాలలో చిక్కుకున్నవాల్లమే. కాకపోతే కొన్ని సంతోషం కలిగిస్తే మరికొన్ని విచారం కలిగిస్తాయి.దానికి కూడా మనమే కారణం అవుతాం . అది తెలియక చికాకు పడటం. మరి ఈ బంధాలు అనుబంధాల గురించి నాతో పంచుకోడానికి మీరు సిద్ధమేనా?అలా అని ఎప్పుడూ కాదు.రకరకాలు మాట్లాడుకుందాం .సరేనా