3, జూన్ 2014, మంగళవారం

తరాల తేడా గుర్తిస్తున్నారా?

ఈ కాలం జంటల్లో సాధారణంగా కన్పిస్తున్న అంశం ఏ ఒక్కరూ వివాహానంతర జీవితం గురించి ఆలోచించడం లేదు. తమ సంసారం బాగుండాలంటే ఏం చేయాలి అనుకోవడం లేదు.దీనికి కారణం కొంత, వివాహ వ్యవస్థలో వస్తున్నా మార్పుల్ని సరిగా అర్ధం చేసుకోకపోవడమే.ఈ కాలపు యువత ఆధునిక జీవితానికి అలవాటు పడుతోంది.అయినా పెళ్లి దగ్గరికొచ్చేసరికి రకరకాల కారణాల వాళ్ళ పెద్దవారిమీదే ఆధార పడుతున్నారు.దాంతో వారి అభిరుచులకు తగిన భాగస్వాములను పొందలేకపోతున్నారు.మన అమ్మానాన్నలు బాగానే ఉన్నారుకదా మనమూ అలాగే ఉండచ్చు అనుకుంటారు.కానీ పెళ్ళయిన వెంటనే గొడవలు..ఎందుకిలా ?లెక్క eక్కడ తప్పుతోందిఅంటే..మన అమ్మానాన్నల తరానికి ,ఇప్పటి తరానికి చాలా తేడా ఉంది.ఇది గుర్తిన్చానంతకాలం సమస్యలు వస్తూనే ఉంటాయి.కొంచెం తీరిక చేసుకుని పెళ్ళికి ముందు మాట్లాడుకుంటే చాలా సమస్యలు దూరం చేసుకోవచ్చు.కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు రాణించడానికి సమర్ధత ఎంత అవసరమో, ఎలా పై అధికారుల మెప్పు పొందాలని ప్రయత్నిస్తామో,అలాగే వివాహబందానికీ కృషి చెయ్యాలి.అంచేత...
-అబ్బాయి అమెరిక నుంచి వచ్చాడని,టైం లేదని హడావుడిగా పెళ్లి చెయ్యకూడదు.జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధానికి కాస్త సమయం కేటాయిస్తే నష్టం లేదు.తల్లిదండ్రులే ఈ విషయంలో సహకరించాలి.అమ్మాయి,అబ్బాయి ఒకరినొకరు అర్ధం చేసుకునే సమయం ఇవ్వాలి.పెళ్లి అయిన ఆరునెలలకే విడాకులకు పరుగెత్తే కంటే, ముందు ఆరునెలలు ఒకరినొకరు అర్ధం చేసుకోవడం మంచిది.
- ఒకరిగురించి మరొకరు తెలుసుకోవడమే కాదు.వారి కుటుంబ నేపథ్యాలూ వివరించాలి.వెళ్లబోయే కుటుంబంలో ఎంతవకు ఇమదగలం,అందుకు ఎలాంటి కృషి చేయాలి అని తెలుసుకోవాలి.పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమ్మాయిని ఉమ్మడి కుటుంబంలో ఇస్తే వచ్చే సమస్యలవంటివి(లేటుగా లేవడం,పూజలు,వంటలు రాకపోవడం...)నివారించవచ్చు.
-పెళ్లి నిర్ణయంలో తల్లిదండ్రుల జోక్యం చాలా తక్కువగా ఉండాలి.అయితే దీనికి ముందు తల్లిదండ్రులూ ప్రిపేర్ కావాలి. చాలా మంది తమ పిల్లల చదువు,దుస్తులు,నగల గురించి ఆలోచించినట్లు పెళ్లి,తర్వాతి జీవితం గురించి ఆలోచించడం లేదు.
- కొత్తగా పెళ్ళయిన వారు కనీసం రెండు సంవత్సరాలు ఇరువైపులా పెద్దలకు దూరంగా ఉండాలి.అప్పుడే ఇద్దరిమధ్య చక్కని స్నేహం పెరుగుతుంది.
-మనం చేసుకునేవారు చూడగానే అద్భుతం అనిపించకపోయినా పర్వాలేదు కానీ వారి సమక్షం అసౌకర్యంగా ఉండకూడదు.అలా అనిపిస్తే ముందే ఆలోచించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి