5, జులై 2010, సోమవారం

ఉద్యోగం ఎందుకు మానేసాను?

నేను ఎప్ప్పుడూ అనుకోలేదు ఒక దినపత్రికలో పని చేస్తానని.సరదాగా ఈనాడు జర్నలిజం స్కూల్ కి అప్లై చేశా. సీటు వచ్చింది. ఆరునెలలు కోర్సు. ఎనిమిది వందలు ఇచ్చేవారు. హాస్టల్ లో ఉండేదాన్ని.చాలా సరదాగా ఉండేది. కాని విజయవాడ నుంచి వేరే ఊరు రావడం అదే మొదటిసారి. దాంతో కొంచెం బెంగగా ఉండేది.కాని తొందరగానే అలవాటు పడ్డాను.కోర్సు అవగానే విజయవాడ లో పోస్టింగ్ ఇస్తారనుకున్న. కాని హైదరాబాద్ ఆఫీసులోనే ఇచ్చారు. వసుంధర మహిళా పేజి లో పనిచేయాలన్నారు. మొదట్లో చాలా కొత్తగా ఉండేది. తర్వాత అలవాటు అయింది. హాస్టల్ లో చాలా విషయాలు నేర్చుకున్న.రకరకాల వ్యక్తులు,స్వభావాలు తెలిసాయి.ఆఫీసు లో కూడా అందరితో ఫ్రీగా మాట్లాడేదాన్ని. దాంతో కొన్ని చిన్న చిన్న అపార్ధాలు. సుమారు అయిదేళ్ళు గవర్నమెంట్ జాబు లా ఎంజాయ్ చేశా. తర్వాత షిఫ్ట్ మార్చారు.అన్నాళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని.రోజు రాత్రి ఎనిమిదింటికి బస్సు లు మారి, మెహదిపట్నం వెళ్లేసరికి తొమ్మిది దాటేది. స్పెషల్ వర్క్ ఉంటె ఇంక లేట్ అయ్యేది.మా బాస్ ఎమన్నా అంటే ఏడుపు వచ్చేది. అయితే పెళ్లి అయ్యాక ఆఫీసు పక్కనే ఇల్లు.హాయిగా ఉండేది. బాబు(టిన్) పుట్టాక కూడా బాగానే పని చేశా.తర్వాత రెండేళ్ళకి మా బాస్ ని మార్చారు. అప్పుడప్పుడే నాకు మంచి ఆర్టికల్స్ రాయడానికి అవకాసం వచింది. వచ్చింది.కాని ఈ కొత్త బాస్ చాల యాంత్రికం.మన బాధలు పట్టవు.అర్ధరాత్రి పన్నెండు అయినా అప్పుడే ఆఫీసుకి వచ్చినట్టు ప్రవర్తించేవాడు.ఒక చిన్న శీర్షికకి గంటలు, గంటలు వేస్ట్ చేసేవాడు. మనకేమో ఇంట్లో చిన్న పిల్లాడు.తెల్లవారుజాము వరకు అలాగే ఉండాల్సి వచ్చేది. మా సీనియర్ వీణ గారి దగ్గర నా అసహనం చూపెదాన్ని.పాపం, ఆవిడ నాకు సర్ది చెప్పేవారు.కొన్నాళ్ళకు నాకు వేరే డెస్క్ బదిలీ అయింది.అక్కడ బాస్ చాలా మంచి ఆయన. కానీ నాకే పని నచ్చలేదు. ఇంట్లో బాబు రోజు ఏడుపే ఆఫీసు మానెయ్యమని.అప్పటికే మా అమ్మ,నాన్న నా గురించి అయిదేళ్ళు మా అబ్బాయి కోసం ఉన్నారు. వాళ్ళు ఊరు వేల్తామన్నారు.ఈలోగా మా శ్రీవారికి బిజీ గ ఉండే ఉద్యోగం వచ్చింది.దాంతో తప్పనిసరి అయి ఉద్యోగానికి రాజీనామా చేశా.ఆ తర్వాత ఎక్కడా చేయలేదు. అదే నా మొదటి,చివరి ఉద్యోగం అయింది.ఇప్పుడు మా వాడు అంటూ ఉంటాడు కావాలంటే వెళ్ళు జాబు కి అని.వాడికి అవసరం తీరిపోయింది కదా ! అయిన ఇంకా అదే ఆఫీసులో చేస్తున్న మా ఫ్రెండ్స్ కష్టాలు చూస్తుంటే మానేసి మంచిపనే చేశా అనిపిస్తుంది.ఆఫీసు మానేసాక కొన్నాళ్ళు బాధగా ఉన్న కుటుంబానికి దగ్గరయ్యాను అనే తృప్తి మిగిలింది.అయినా ఖాళీగా లేకుండా ఫ్యామిలీ కౌన్సేల్లింగ్ కోర్సు చేశాను.ఇప్పుడు సొంతంగా సెంటర్ పెట్టుకున్న. aదన్న మాట నా ఉద్యోగం సంగతి.

2 కామెంట్‌లు:

  1. తెలుగు లో టైప్ చేయడానికి lekhini.org ని వాడండి. సులువుగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. పిల్లలకోసం ఉద్యోగం మానేయటం లో తప్పు లేదు. మే మిత్రులలో (కరియర్ కోసం పెళ్లి పిల్లలు లేట్ అయినవారితో)15 ఏళ్ల తర్వాత చూడండి మీ పిల్లలు బాగా ఎదిగి చేతికి వచిన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు స్కూల్ కి వెళుతూ ఉంటారు.

    రిప్లయితొలగించండి